Share News

శిథిల భవనంలో చిన్నారులు క్షేమమేనా?

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:14 AM

బొమ్మలరామారం మండలంలోని సోలిపేట గ్రామంలో అంగనవాడీ కేంద్రం భవనం పైకప్పు పెచ్చులూడుతోంది.

  శిథిల భవనంలో చిన్నారులు క్షేమమేనా?
పెచ్చులూడిన భవనం గోడ

పెచ్చులూడున్న అంగనవాడీ కేంద్రం పైకప్పు

బొమ్మలరామారం, జూన 30 (ఆంధ్రజ్యోతి): బొమ్మలరామారం మండలంలోని సోలిపేట గ్రామంలో అంగనవాడీ కేంద్రం భవనం పైకప్పు పెచ్చులూడుతోంది. చిన్నారులకు ప్రమాదం పొంచిఉంది. గ్రామంలో అంగనవాడీ కేం ద్రానికి కి సొంత భవనం లేకపోవడంతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఖాళీగాఉన్న గదిని కొంతకాలంగా అంగనవాడీ కేంద్రానికి ఉపయోగిస్తున్నారు. ఆ భవనం చూడడానికి చక్కగా ఉన్నప్పటికీ నాణ్యత ప్రమాణ లోపంతో భవనం పైకప్పు, గోడలు బీటలు వారాయి. గతంలో రెండు మూడ సార్లు పైకప్పు నుంచి స్లాబ్‌ పెచ్చల ఊడి కింద పడ్డాయి. ఆసమయంలోనూ చిన్నారులకు ప్రమాదం తప్పింది. ప్రమాదం వుందిని తెలిసి కూడా అదే భవనంలో అంగనవాడీ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు.

నిత్యం భయంతోనే నిర్వహణ

అంగనవాడీ భవనం పెచ్చులూడి శిథిలావస్థకు చేరుకుందని విషయం గ్రామంలో అందరికీ తెలిిసీ ఎవరూ పట్టించుకోవడం లేదు. చిన్నారుల తల్లిదండ్రులు అంగనవాడీ కేంద్రానికి తమ పిల్లలను పం పాలంటే భయపడుతున్నారు. గత మార్చి నెలలో ఆ గది వరండాలో ఒకేసారి స్లాబ్‌ నుంచి పెచ్చులూడి కిందపడ్డాయి. అప్పటి నుంచి తల్లిదండ్రులు అంగనవాడీ కేంద్రానికి తమ పిల్లలను పంపడానికి నిరాకరిస్తున్నారు. ఈ అంగనవాడీ కేంద్రంలో సుమారు 20మంది చిన్నారులతోపాటు గ్రామంలో గర్భిణులు,బాలింతలు నిత్యం కేంద్రానికి వస్తుంటారు. ఈ భవనంలో స్లాబ్‌ భాగం మొత్తం బీటలు వారి పెచ్చులడి కిందపడే పరిస్థితి ఏర్పడింది.

అధికారులు ఆదేశించినా..

గత వేసవి ప్రారంభం మొదటి మార్చినెల రెండో వారంలో శిథిలావస్థలో ఉన్న ఈ భవనం వరండాలలో పెచ్చులూడి కిందపడిన విషయంని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి చైల్డ్‌ డెవలప్మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, స్థానిక మండల స్థాయి అధికారలు, స్థానికి సర్పంచ స్పందించి పాఠశాలలోని మరో తరగితి గదిలోకి అంగనవాడీ కేంద్రాన్ని మార్చారు. ఆరోజు అంగనవాడీ కేంద్రానికి మార్చిన గదిని ప్రీపైమరి పాఠశాలకు కేటాయిం చడంతో తిరిగి అంగనవ్వాడీ కేంద్రానికి పాత శిథిలావస్థలో ఉన్న భవనమే దిక్కయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు

మరో గదిలోకి మారుస్తాం

-శ్యామల, ఎంపీడీవో, బొమ్మలరామారం

సోలిపేట గ్రామంలో అంగనవాడీ భవనం శిథిలావస్థలో ఉన్నది వాస్తవమే. గతంలో భవనం స్లాబ్‌ నుంచి పెచ్చులూడి కిందపడడంతో చిన్నారులకు పెను ప్రమాదం తప్పింది. అప్పటికప్పుడు ఆసమయంలో అంగనవాడీ కేంద్రాన్ని మరో గదిలోకి మా ర్చాం. మళ్లీ ఈవిద్యా సంవత్సరంలో ఎందుక పాత భవనంలో నడిపిస్తున్నారో తెలయదు. వెంటనే పాఠశాలలో ఖాళీగా ఉన్న మరో గదిలోకి మారుస్తాం.

Updated Date - Jul 01 , 2026 | 12:15 AM