పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:21 AM
నాగార్జునసాగర్, జూలై 1(ఆంధ్రజ్యోతి) : నాగార్జునసాగర్ ఫైలాన్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఐలయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నాగార్జునసాగర్, జూలై 1(ఆంధ్రజ్యోతి) : నాగార్జునసాగర్ ఫైలాన్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఐలయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగార్జునసాగర్‌లో సివిల్, ఈఈఈ, అడ్వాన్స్‌డే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరి స్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు నేడు (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని జూలై 3వ తేదీ ఉదయం 11 గంటలకు కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.