Share News

ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ లైనింగ్‌ పనులకు మోక్షం

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:55 AM

దేవరకొండ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలోని 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు జి ల్లాలోని 516 గ్రామాలకు తాగునీరు అందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ప్రధాన కాలువ మరమ్మతుకు ఎట్టకేలకు మో క్షం లభించింది.

 ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ లైనింగ్‌ పనులకు మోక్షం

ఫ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

దేవరకొండ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలోని 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు జి ల్లాలోని 516 గ్రామాలకు తాగునీరు అందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ప్రధాన కాలువ మరమ్మతుకు ఎట్టకేలకు మో క్షం లభించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రధాన కా ల్వ 135 కిలోమీటర్లు మరమ్మతులకుగాను రూ. 442 కోట్లు కేటాయించింది. కాగా బృంద కన్‌స్ట్రక్షన్‌ రూ.334 కోట్లకు ఒప్పందం చేసుకొని మరమ్మతు పనులు ప్రారంభించింది. 25 ఏళ్లుగా ఏ ఎమ్మార్పీ ప్రధాన కాలువతోపాటు డిస్ర్టీబ్యూటరీలు ఇరువైపుల కంపచెట్లు పెరిగి శిథిలావస్థకు చేరి మరమ్మతుకు నోచుకోలేదు. దీంతో ప్రాజెక్టు నీరు వృఽథా అయ్యే పరిస్థితి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, డిండి ఎత్తిపోతల, పెండ్లిపాకల, నక్కలగండి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. నిధులు కేటాయిస్తుండడంతో ప్రాజెక్టుల పనులు వేగవంతం అవుతున్నాయి.

రూ.334 కోట్లతో మరమ్మతు

నల్లగొండ జిల్లాలోని 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ 130 కిలోమీటర్లకుపైగా విస్తరించి ఉంది. అందుకుగాను రూ.334 కోట్లతో మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ఏఎమ్మార్పీ ద్వారా దేవరకొండ, నాగార్జునసాగర్‌, నల్లగొండ, నకిరేకల్‌ ని యోజకవర్గాలకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు ఏఎమ్మార్పీ నుంచి ప్రతిరోజు హైదరాబాద్‌ జంటనగరాలకు తాగునీటి అవసరాలకు 525 క్యూసెక్కుల నీరు, మిషన్‌భగీరథకు 45 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 25 ఏళ్ల తరువాత ప్రధాన కాల్వ మరమ్మతులకు మోక్షం రావడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏఎమ్మార్పీ ప్రధా న కాల్వతోపాటు డిస్ర్టీబ్యూటరీలు కంపచెట్లు పె రిగి శిథిలావస్థలో ఉన్నాయి. మరమ్మతు పను లు ప్రారంభం కావడంతో మొదటగా ప్రధాన కాల్వకు ఇరువైపులా కంపచెట్లు తొలగింపు ప్రక్రియను యంత్రాలతో చేపడుతున్నారు. దీంతోపాటు కొన్నేళ్లుగా శిథిలావస్థలో ఉన్న కాల్వ లోతట్టును, పొడవు, వెడల్పు కొలతలు తీసుకొని పనులు చేపడుతున్నట్లు ఏఎమ్మార్పీ అధికారులు తెలుపుతున్నారు. ప్రధాన కాలువ సీసీలైన్లు మరమ్మతులు పూర్తయితే ఆయకట్టు రైత ులకు పూర్తిస్థాయిలో నీరు వృథాగా పోకుండా సాగునీరు అందనుంది. మరమ్మతు పనులు ప్రారంభం కావడంతో ఆయకట్టు రైతులు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు.

పనులు వేగవంతంగా పూర్తి

ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ సీసీ లైనింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. మొదటగా యం త్రాలతో కాలువ ఇరువైపులా చెట్లు తొలగింపు పనులు జరుగుతున్నాయి. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. మరమ్మతు పనులు పూర్తయితే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందుతుంది.

- కేతావత్‌ నెహ్రూనాయక్‌, ఈఈ

ఏఎమ్మార్పీ గుర్రంపోడు డివిజన్‌

Updated Date - Mar 13 , 2026 | 12:55 AM