ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:38 AM
దేశంలో సూపర్ ఎల్‌నినో ఉందని, ఇప్పటికే వర్షాభావ పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చే సేలా అధికారులు అవగాహన కల్పించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
తాగునీటికే ప్రథమ ప్రాధాన్యం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలి
ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం అండగా ఉంటుంది
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండలో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష
నల్లగొండ, జూలై 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశంలో సూపర్ ఎల్‌నినో ఉందని, ఇప్పటికే వర్షాభావ పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చే సేలా అధికారులు అవగాహన కల్పించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమా ర్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి దాసరి హరిచందనతో కలిసి మూడు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యే లు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడం, వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. బోర్లు ఏర్పాటుచేసినా పంట చేతికందేవరకు నీరందడం కష్టమనే విషయాన్ని వివరించాలన్నారు. వర్షాలు రాకపోతే వచ్చే జూలై వరకు జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నీటినే వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రా జెక్టుల్లో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో తాగునీటిని అందించేందుకు లింకేజీ ఏర్పాటుచేయాలని సూచించారు. తాగునీటికి ఇబ్బంది ఎదురైతే, అవసరమైతే కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. జలాశయాల్లో నీటి నిల్వలు, తాగునీటి సరపరా పై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తక్కు వ నీరు, తక్కువ పంట కాలంలో ఉండే పెసర, నువ్వులు, ఆము దం, జొన్నలు, కంది వంటి రకాల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సూర్యాపేట జిల్లాకు ప్రధాన తాగునీటి వనరైన పాలేరు జలాశయంలో నీటి లభ్యత ఇబ్బందులపై 20 రోజుల ముందే తమను అప్రమత్తం చేయాలని, అప్పుడే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు వీలవుతుందన్నారు. తాగునీటి కోసం ట్యాంకర్లు, బో రు బావులు సిద్ధం చేయాలని ఆదేశించారు. అవసరమైతే రైతుల బోర్లను వినియోగించాలన్నారు. ప్రత్యామ్నాయ తాగునీటి వనరులు లేని గ్రామాలను గుర్తించి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుంది: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వర్షాభావ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి. ఆ దిశగా అధికారులు వారికి అవగాహన కల్పించాలి. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేని విషయాన్ని, కొత్త బోర్లు తవ్వినా పంట చేతికందేవరకు నీరందడం కష్టమనే విషయాన్ని వారికి వివరించండి. తక్కువ నీరు, తక్కువ పంట కాలం ఉండే పెసర, నువ్వులు, ఆముదం, జొన్నలు, కంది తదితర పంటలు సాగుచేసేలా ప్రచారం నిర్వహించాలి.
కరువు పరిస్థితిలో ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఎల్‌నినోతో ఏర్పడే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలకు అండగా ప్రభుత్వం, అధికార యం త్రాంగం ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అండగా ఉండాలని, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటిని పొదుపుగా వినియోగించడంపై అవగాహన కల్పించాలన్నారు. తాగునీటిని దృష్టిలో ఉంచుకొని ఉదయసముద్రం రిజర్వాయర్‌ను నింపాలని, మూసీ నుంచి తిప్పర్తికి నీటిని విడుదలచేయాలన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో మూడు నెలలుగా నెలకొన్న మిషన్‌భగీరథ నీటి సరఫరా ఇబ్బందిని తక్షణం పరిష్కరించాలన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికే రైతులు వరి నాట్లు వేసుకున్నందున ఓవర్‌లోడ్ కాకుండా విద్యత్ అందించాలన్నారు. లోవోల్టేజీ సమస్య ఉన్నచోట అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దేవరకొండ నియోజకవర్గంలో పెండ్లిపాకల నుంచి మూడు మండలాలకు తాగునీరందించే మిషన్‌భగీరథ పథకం రెండు నెలలుగా పనిచేయకపోవడంతో తా గునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని, అక్కడ ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు ఇతర మరమ్మతులు చేయాల్సిన మిషన్‌భగీరథ మెయింటెనెన్స్ ఏజెన్సీ ఎందుకు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏజెన్సీ పదేళ్ల పా టు నిర్వహణ బాధ్యత చూడాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఎందుకు అక్క డ నిధులు ఖర్చు చేయాలని ప్రశ్నించారు. తక్షణమే సంబంధిత ఏజెన్సీకి నోటీసులు ఇవ్వాని, మరమ్మతులు చేయకపోతే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు.
సమన్వయంతో పనిచేయాలి :ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎ దుర్కొనేందుకు ఉమ్మడి జిల్లా అధికా ర యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మం త్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. ప్రధానంగా తాగునీరు, విద్యుత్, వ్యవసాయరంగాలపై ఎల్‌నినో ప్ర భావం చూపుతుందన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు రైతులు వరికి బదు లు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే వరి సాగుచేసిన రైతులు నష్టపోకుండా అధికారులు తగిన సూ చనలు ఇవ్వాలన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు అదనపు బోర్లు వేయకుం డా చూడాలని చెప్పారు.
పైప్‌లైన్ పనులను పూర్తి చేయాలి : బీర్ల అయిలయ్య, ప్రభుత్వవిప్
యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు తాగునీరందించే పథకానికి సంబంధించి పైప్‌లైన్ నిర్మాణానికి రూ. 200 కోట్లు తమ ప్రభుత్వం వచ్చాక కేటాయించామని, అయితే ఈ పథకం కింద చే పట్టిన పనుల్లో షామీర్‌పేట వద్ద అటవీశా ఖ అనుమతుల పేరుతో 5 కిలోమీటర్ల లైన్ నిర్మాణం పెండింగ్ పడింది. ఈ అంశంలో మిషన్‌భగీరథ అధికారులు చొరవ తీసుకోవాలని కోరగా, మిషన్ భగీరథ అధికారులు అటవీశాఖ నుంచి ఎల్-1 అనుమతులు వచ్చాయి. ఎల్-2 అనుమతులు కూడా త్వరలోవస్తాయని, అవి వచ్చాక అటవీశాఖ క్లియరెన్స్ రాగానే పనులు వేగంతం గా పూర్తి చేస్తాం. బస్వాపూర్ భూసేకరణకు రూ.87 కోట్లు కేటాయిస్తే ఆ రిజర్వాయర్ పనులు పూర్తవుతాయని, అందుకు ప్రభుత్వం సహకరించాలి. ఆలేరులో ఏడు సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయి. వాటి పనులు వేగవంతంగా పూర్తిచేసి అందుబాటులోకి తెస్తే కరెంటు ఇక్కట్లు తప్పుతాయి.
ముందస్తు చర్యలు తీసుకోవాలి :నేనావత్ బాలునాయక్, దేవరకొండ ఎమ్మెల్యే
దేవరకొండ నియోజకవర్గంలో ఎల్‌నినో ప్ర భావంతో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం క నిపిస్తోంది. దేవరకొండ నియోజకవర్గంలో అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముం ద స్తు చర్యలు తీసుకోవాలి. తండాల్లో తాగునీటి స మస్య రాకుండా చూడాలి.
అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలి : మందుల సామేలు, తుంగతుర్తి ఎమ్మెల్యే
మూడు జిల్లాల్లో విస్తరించిన తుంగతుర్తి నియోజకవర్గంలో పలు గ్రా మాలకు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. ఆ గ్రామాల్లో బోరు బావులు వేయించాలి. విద్యుత్ సరఫరాలో లోటులేకుండా చూడాలి. లోవోల్టేజీ సమస్యల నివారణకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలి. బునాదిగాని, కేతిరెడ్డి కాల్వల పూర్తికి అవసరమైన నిధులివ్వాలి.
ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కోతుల బెడద - కుందూరు జైవీర్‌రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర వంటి పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో ఆ పంటలు పండించలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు. కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలు, చెరువుల మరమ్మతులకు నిధులు ఇవ్వాలి. ఆ పనులను తక్షణమే పూర్తిచేయాలి.
భూగర్భజలాల పరిరక్షణ చర్యలు చేపట్టాలి : పద్మావతిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులను అధిగమించడంలో భాగంగా భూగర్భజలాల సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఇంకుడు గుంతలు, ఊటకుంటల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా వ్యవసాయ, ఉద్యానవనశాఖాధికారులు విస్తృత అవగాహన కల్పించాలి. కోతుల సమస్యలపైనా దృష్టి సారించాలి.
పేటలో 20ఎంఎల్‌డీలు సరఫరా చేయాలి :గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే
సూర్యాపేట పట్టణానికి తాగునీటి సరఫరా తగ్గిందనే సమాచారం ప్రజల నుంచి వస్తోంది. ప్రతీ రోజూ కనీసం 20 ఎంఎల్‌డీకి తగ్గకుండా తాగునీరు సరఫరా చేసే లా చర్యలు తీసుకోవాలి. నీటిఎద్దడి రాకమునుపే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి.
-