Share News

Alliance dispute: భువనగిరిలో పొత్తు వివాదం

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:50 AM

క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే కమ్యూనిస్టు పార్టీలో మునిసిపల్‌ ఎన్నికల పొత్తులతో జిల్లా ముఖ్యనేతల మధ్య విభేదా లు పొడచూపాయి.

 Alliance dispute: భువనగిరిలో పొత్తు వివాదం

బజారుకెక్కిన సీపీఐ ముఖ్యనాయకులు

కాంగ్రె్‌సకు మద్దతు ప్రకటించిన గోద

పొత్తు లేదంటున్న యానాల

యాదాద్రి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే కమ్యూనిస్టు పార్టీలో మునిసిపల్‌ ఎన్నికల పొత్తులతో జిల్లా ముఖ్యనేతల మధ్య విభేదా లు పొడచూపాయి. జిల్లా కేంద్ర మునిసిపాలిటీలో కాం గ్రె్‌సకు మద్దతు కొనసాగుతుందని సీనియర్‌ నేత ప్రకటించగా, ఆయన ప్రకటనతో తమకు సంబంధం లేద ని, బీఆర్‌ఎ్‌సతో కలిసి వెళ్తామని పార్టీ జిల్లా కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో జిల్లాలోని ఇద్దరు ప్రధాన నేత మధ్య వివాదం బజారుకెక్కడంతో పార్టీ వర్గాలు,సానుభూతిపరులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

భువనగిరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డితో కలిసి సీపీఐ రాష్ట్ర నాయకులు గోద శ్రీరాము లు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, భువనగిరి మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అనుమతి మేరకు 11వ వార్డులో పార్టీ తరపున నామినేషన్‌ వేసిన అభ్యర్థిని ఉపసంహరింపజేయనున్నట్టు ఆయన ప్రకటించారు. అందుకు అభ్యర్థికి కో-ఆప్షన్‌ అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్‌ అంగీకరించిందన్నారు. దీంతో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కాంగ్రె్‌స-సీపీఐ పొత్తు కుదిరినట్టు ప్రకటన విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి సీపీఐ పట్టణ కమిటీ, జిల్లా కమిటీ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అనిల్‌కుమార్‌రెడ్డితో తమకు సంబంధం లేదని ప్రకటించారు. ఈ విషయంపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తాను జిల్లా కమిటీ తరపున కాంగ్రె్‌సతో చర్చలు నిర్వహించగా, ఒక్క సీటు కూడా ఇచ్చేందుకు నిరాకరించారన్నారు. దీంతో పార్టీకి చెందిన ముఖ్యనాయకులు ఇండిపెండెట్‌గా నామినేషన్‌ వేయడంతో బీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించిందని తెలిపారు. అందుకే తాము భువనగిరిలో మునిసిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సతో కలిసి వెళ్తామని పరోక్షంగా చెప్పారు.

కొనసాగుతున్న బుజ్జగింపులు

(ఆంధ్రజ్యోతి, మోత్కూరు): తుంగతుర్తి నియోజకవర్గంలో మోత్కూరు మునిసిపాలిటీలో 12 వార్డులకు 80మంది, తిరుమలగిరి మునిసిపాలిటీలో 15వార్డులకు 145 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి ఒక్కో వార్డులో ఇద్దరు, ముగ్గురు చొప్పున పోటీపడుతున్నారు. ఎవరికివారు తగ్గేదేలే అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య విభేదాల కారణంగా అభ్యర్థులను నిర్ణయించి బీ-ఫాం ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. తిరుమలగిరి, మోత్కూరు మునిసిపాలిటీల్లో తాను సూచించిన వ్యక్తులు కొందరికి టికెట్‌ ఇవ్వాలని ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టుబడుతున్నట్టు సమాచారం. సర్వేలను కాదని ఎవరి వర్గాన్ని వారు కాపాడుకునేలా చూస్తుండటంతో వివాదం నెలకొంది. కాంగ్రెస్‌ బీ-ఫాం ఇచ్చాకే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం వేచిచూసే ధోరణిలో ఉంది. బీజేపీ సైతం బీ-ఫాంలు ఇవ్వలేదు. ఈ నెల 3న ఉపసంహరణకు సమయం ఉంది. దీంతో రెబల్స్‌ను బుజ్జగించేందుకు తగినంత సమయం లేకుండాపోతోందని పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సోమవారమైనా పార్టీలు బీ-ఫాం ఇస్తాయా? లేదా? అని మదనపడుతున్నారు. కొందరు టికెట్‌ రాకపోతే చూద్దాంలే అని ప్రచారాన్ని సైతం ప్రారంభించడం గమనార్హం.

కాంగ్రె్‌సకు సీపీఐ మద్దతు లేదు

సీపీఐ జిల్లా కార్యదర్శి దామోదర్‌రెడ్డి

(ఆంధ్రజ్యోతి, భువనగిరి గంజ్‌): భువనగిరిలో కాంగ్రెస్‌ పార్టీకి సీపీఐ మద్దతు లేదని, ఎమ్మెల్యే కుం భం అనిల్‌ కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్‌కు సీపీఐ జిల్లా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సతో పొత్తుకు తనతోపాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డితో చర్చలు జరిపినా ఒక్క సీటు కూడా కేటాయించకుండా కేవలం కో-ఆప్షన్‌తోనే సరిపెట్టుకోవాలని సూచించడంతో పొత్తు కుదరలేదు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్‌తో తమ పార్టీకి సంబంధం లేదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయ ణ, చెడ చంద్రయ్య, ఎండీ.ఇమ్రాన్‌, కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, చెక్క వెంకటేష్‌, ఉప్పల ముత్యాలు, చిగుర్ల లింగం, పెరబోయిన మహేందర్‌, పుట్ట రమేష్‌, గనబోయిన వెంకటేష్‌, సామల శోభన్‌బాబు, సామల భాస్కర్‌, చింతల మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రె్‌సతోనే సీపీఐ

ఎమ్మెల్యే కుంభం, సీపీఐ నేత శ్రీరాములు

(ఆంధ్రజ్యోతి, భువనగిరి టౌన్‌): భువనగిరి మునిసిపల్‌ ఎన్నికల్లో సీపీఐ మద్దతు కాంగ్రె్‌సకేనని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం భువనగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రస్థాయిలో ఉన్న పొత్తు ధర్మాన్ని భువనగిరిలో కూడా కొనసాగిస్తున్నామన్నారు. సీపీఐకి మునిసిపల్‌ కో-ఆప్షన్‌ పద వి ఇస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యు డు గోద శ్రీరాములు మాట్లాడుతూ, బీఆర్‌ఎ్‌స తో తమ పార్టీ నాయకులు కొంత మంది కుదుర్చుకున్న పొత్తుకు రాష్ట్ర పార్టీ అనుమతి లేదని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థి అనూషకు రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బీ-ఫాం ఇచ్చారని, పార్టీ నిర్ణయం మేరకు కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా ఆమె నామినేషన్‌ ఉపసంహరించుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇరు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 12:50 AM