Share News

తొలి భేటీపైనే అందరి ఆసక్తి

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:23 AM

తిరుమల తరహాలో యాదగిరీశుడి దివ్యక్షేత్రం అభివృద్ధికి అడుగులు పడను న్నాయి. నేడు జరిగే పాలక మండలి తొలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకా శాలు కన్పిస్తున్నాయి. ఇందులో భాగంగా డోనర్‌ పాలసీ, రవాణా, పార్కింగ్‌, వసతి, ప్రసాదాలపై చర్చించనున్నారు.

తొలి భేటీపైనే అందరి ఆసక్తి

కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

తిరుమల తరహాలో ‘యాదగిరి’ దివ్యక్షేత్రం

భక్తుల సౌకర్యాలకే పెద్దపీట

డోనర్‌ పాలసీ, రవాణా, పార్కిం గ్‌, వసతి, ప్రసాదాలపై చర్చ

ఆలయ అభివృద్ధి కార్యాచరణపై కసరత్తు

గుట్ట ఆలయ పాలకమండలి తొలిభేటీలో విస్తృత ఎజెండా

(ఆంధ్రజ్యోతి- యాదాద్రి): తిరుమల తరహాలో యాదగిరీశుడి దివ్యక్షేత్రం అభివృద్ధికి అడుగులు పడను న్నాయి. నేడు జరిగే పాలక మండలి తొలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకా శాలు కన్పిస్తున్నాయి. ఇందులో భాగంగా డోనర్‌ పాలసీ, రవాణా, పార్కింగ్‌, వసతి, ప్రసాదాలపై చర్చించనున్నారు.

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసిం హ స్వామి దేవస్థాన పాలకమండలి తొలి సమావేశం శుక్రవారం జరగనుంది. తిరుమల తరహాలో ఆలయానికి స్వ యం ప్రతిపత్తి కల్పించిన అనంతరం ఏర్పాటైన ధర్మకర్తల మండలి జూలై 11న పదవీ ప్రమాణస్వీకారం చేసింది. పాలకమండలి చైర్మన్‌ డాక్టర్‌ మన్నె సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన లాంఛనంగా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆలయ వ్యవహారాలు, భక్తుల సదుపాయాలు, సమస్యలతోపాటు తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న వసతి సదుపాయాలు, ఇతర సౌకర్యాలు, అక్కడ ఉన్నవేమిటీ.. ఇక్కడ చేపట్టాల్సిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి అవగాహనకోసం దేవస్థానం ఈవో జె.భవానీశంకర్‌ నేతృత్వంలో ఆలయ వివిధ విభాగాల అధికారులతో తిరుమలను సందర్శించి, అధ్యయనంసైతం జరిపారు. అయితే ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం శుక్రవారం జరుపుతు న్న ఈ తొలిభేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉం టాయని భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఆలయాన్ని సందర్శించే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి, పాలనా వ్యవస్థ బలోపేతం, తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పలు కీలక అంశాల ను సమావేశం ఎజెండాలో చేర్చినట్లు తెలుస్తోంది.

తిరుమల తరహాలో సౌకర్యాలపై దృష్టి

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రానికి వారాంతపు రోజు ల్లో తిరుమల ఆలయ తరహాలోనే భక్తుల సందర్శన ఉంటుంది. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, దర్శన విధానం, వసతి, పార్కింగ్‌, రవాణా, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యంవంటి సౌకర్యాలను మెరుగుపరిచే అంశాలను పాలకమండలి చర్చించనుంది. తిరుమలలో అమలు చేస్తున్న భక్తుల రద్దీ నిర్వహణ (క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌), ఆలయ నిర్వహ ణ విధానాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేయడానికి యాదగిరిగుట్ట ఆలయ అధికారుల బృందం ఇప్పటికే తిరుమల ఆలయంలో అధ్యయనం చేసి, అక్కడి అధికారులతో చర్చించి తగు నివేదికను రూపొందించారు. ఈ అధికారుల బృందం అందించే నివేదిక ఆధారంగా తక్షణ మార్పు లు.. చేర్పులు ఏమి చేయాలి, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన అంశాలను సమావేశం చర్చించి తగు నిర్ణయాలు చేస్తుందని భావిస్తున్నారు.

సమగ్ర డోనర్‌ పాలసీ..

ఆలయ అభివృద్ధికి డోనార్‌ పాలసీని రూపొందించే అం శం సైతం ఎజెండాలో చర్చించనున్నారు. ప్రస్తుతం యాదగిరిగుట్ట ఆలయానికి సరైన డోనర్‌ పాలసీ అనేది లేదు. ఆలయ అభివృద్ధిలో దాతలను భాగస్వాములను చేయడమే ప్రధానాంశంగా పాలసీని రూపొందించే విధంగా ధర్మకర్తల మండలి తగు నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తోంది. స్వామివారి సన్నిధిలో సౌకర్యాల కల్పనలో భాగస్వాములైన దాతలకు ఆలయం తరఫున కల్పించే సౌకర్యాలు, విరాళాల సేకరణ, వినియోగంపై పారదర్శకత, ఆలయ అభివృద్ధి పనుల్లో వారి భాగస్వామ్యం మరింత పెంచడానికి విధివిధానాల రూపకల్పనపై పాలకమండలి దృష్టిసారించనుంది.

భక్తులకు వసతుల కల్పనపై ప్రత్యేక కసరత్తు

యాదగిరిగుట్ట ఆలయానికి రోజురోజుకూ భక్తుల రాక పెరిగిపోతోంది. భక్తుల సంఖ్యకు అనుగుణమైన వసతి సదుపాయాలు ఏమాత్రం అందుబాటులో లేవు. ఆలయ అభివృద్ధికంటే ముందుగల వసతులు సైతం తొలగించారు తప్ప, పునరుద్ధరించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రస్తుత పాలకమండలి ముందున్న ప్రధాన సవాల్‌ భక్తులకు వసతి సౌకర్యాల కల్పనగా మారనుంది. బస చేయడానికి అవసరమైన కాటేజీలు, గదులు, సామాన్య భక్తులతోపాటు కార్లు తదితర వాహనాల్లో వచ్చే భక్తులకు మెరుగైన రవాణా, పార్కింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం వంటి అంశాలు చర్చించక తప్పని సమస్యలుగా ఉన్నాయి. భక్తులు స్వామివారి దర్శనానికి ఆలయానికి వచ్చినప్పటి నుంచి తిరిగి తమతమ గమ్య స్థానాలకు చేరేంతవరకూ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, సమగ్ర సదుపాయాలు కల్పించాలని ఆలయ పాలకమండలి దృష్టి సారించాల్సి ఉంది.

ఆధ్యాత్మిక నగరి అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దబడింది. అంతర్జాతీయస్థాయిలో ఈ క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటకకేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ఈ క్రమంలో ప్రపంచస్థాయి ప్రమణాలతో దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్శించడానికి అవసరమైన అభివృద్ధి పనులపై పాలకమండలి చర్చించాల్సిన అవసరమెంతో ఉంది. ప్రస్తుతం అంతంత మాత్రంగాగల సౌకర్యాలను మరింత విస్తరించడం, భవిష్యత్‌ భక్తుల తాకిడికి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంపై దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చించి తగు ప్రతిపాదనలు చేయాల్సిన అవసరముందని భావిస్తున్నారు.

స్వయం నిర్ణయాధికారంపై చర్చ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇప్పటివరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో పాలనా వ్యవహారాలను సాగించారు. అయితే తాజాగా 2025 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ చట్టంలో తీసుకొచ్చిన సవరణల ద్వారా యాదగిరిగుట్ట ఆలయానికి స్వయం ప్రతిపత్తిని కల్పించింది. ఈ స్వయం ప్రతిపత్తి గెజిట్‌ అయినప్పటికీ, ఆలయ పరిపాలన మాత్రం ఇప్పటివరకు దేవాదాయ శాఖ కమిషనరేట్‌ కనుసన్నల్లోనే సాగింది. తాజాగా ప్రస్తుతం ఆలయానికి ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం, ఒక ఐఏఎస్‌ అధికారిని కార్యనిర్వహణాధికారిగా నియమించి, పాలక మండలి నేతృత్వంలో పాలనా వ్యవహారాలు సాగించాలని నిర్ణయించారు. దీంతో తొలిసారిగా స్వయం ప్రతిపత్తి హోదాలో ఏర్పాటైన యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి నిర్ణయాధికారాలు ఏమిటీ, ఎవరికి.. ఏ మేరకు అధికారాలు ఉంటాయి. పాలకమండలికి గల నిర్ణయాధికారాలు, ప్రభుత్వానికి గల నిర్ణయాధికారాలేమిటీ అనే అంశాలపై మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. దీంతో యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలికి గల స్వీయ నిర్ణయాధికారాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకావాలు ఉంటాయని భావిస్తున్నారు.

సర్వత్రా ఉత్కంఠ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలక మండలి ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆలయ అభివృద్ధి అనే కోణమే ప్రధాన ఎజెండాగా, సీఎం రేవంత్‌రెడ్డి స్వయం గా ఎంపిక చేసిన పాలక మండలి చైర్మన్‌, సభ్యులు ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై ఆలయ వర్గాలతోపాటు స్వామివారి భక్తుల్లో ఉత్కంఠ నెలకొంది. తిరుమల తరహాలో సౌకర్యాలు, దాతల సహకారం, ఆలయ పాలనలో వినూత్న మార్పులు, మౌలిక వసతులకల్పన అంశాలపై ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఏయే తీర్మానాలు చేసి, ప్రభుత్వానికి నివేదిస్తారనేది రాజకీయ వర్గాల్లో సైతం చర్చానీయాంశంగా మారింది.

Updated Date - Aug 14 , 2026 | 12:23 AM