Share News

సామర్థ్యాల పెంపునకు ఏఐ పాఠాలు

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:53 PM

పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతీ విషయానికి వినియోగించ డం ఇటీవల పెరిగింది. అందులో రోజురోజుకూ నూతన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ) అన్నిరంగాల్లోనూ కీలకంగా మా రింది. ఏఐ ద్వారా చదువులో వెనకబడిన విద్యార్థుల సామర్థ్యాల ను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇం దుకోసం జిల్లాలో 68 ప్రాథమిక పాఠశాలలను గుర్తించి అందులో 3, 4, 5 తరగతుల్లో వెనకబడిన విద్యార్థులకు ఏఐ ద్వారా పాఠాలు అందించి తీర్చిదిద్దనున్నారు.

సామర్థ్యాల పెంపునకు ఏఐ పాఠాలు

3,4,5 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు

ఏఐతో అర్థమయ్యేలా బోధన

జిల్లాలో 68 పాఠశాలల ఎంపిక

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట (కలెక్టరేట్‌){ పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతీ విషయానికి వినియోగించ డం ఇటీవల పెరిగింది. అందులో రోజురోజుకూ నూతన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ) అన్నిరంగాల్లోనూ కీలకంగా మా రింది. ఏఐ ద్వారా చదువులో వెనకబడిన విద్యార్థుల సామర్థ్యాల ను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇం దుకోసం జిల్లాలో 68 ప్రాథమిక పాఠశాలలను గుర్తించి అందులో 3, 4, 5 తరగతుల్లో వెనకబడిన విద్యార్థులకు ఏఐ ద్వారా పాఠాలు అందించి తీర్చిదిద్దనున్నారు.

ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులను సాంకేతిక రంగం వైపు మళ్లించడంతో పాటు వారి సామర్థ్యాల ను మెరుగుపర్చేందుకు విద్యాశాఖ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి చదువులో వెనకబడిన వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలోని ప్రాథమిక పా ఠశాలల్లో 3, 4, 5 తరగతుల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి విడతల వారీగా ఏఐ పాఠాలు అందించనున్నారు.విద్యార్థుల్లో మౌఖిక భాష, సంఖ్యాజ్ఞానం అభ్యాసనతో పాటు గణితంలో చతుర్వి ద ప్రక్రియల్లోనూ ఆశించిన స్థాయి సామర్థ్యాలు సా ధించకపోవడంతో పలువురు విద్యార్థులు విద్యలో వె నుకబాటుకు గురవుతున్నారు. అందుకోసం విద్యాశా ఖ ఆధ్వర్యంలో పలురకాల కార్యక్రమాలు అమలుచేస్తున్నా ఫలితాలు రావడంలేదు. ఈనేపథ్యంలో కృత్రి మమేధ సాయంతో విద్యార్థుల్లో మెరుగైన సామర్థ్యాల సాధన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

68 పాఠశాలల్లో అమలు

ఏఐ తరగతులను జిల్లాలోని 68 ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే ప్రస్తుతానికి అమలుచేస్తున్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కలిపి ఉన్న పాఠశాలలనే ఎంపిక చేశారు.ఆయాపాఠశాలలకు ఏఐ బో ధనకోసం ప్రత్యేకంగా కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని సమకూర్చారు. కంప్యూటర్‌లకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. పా ఠశాలలోని 3,4,5 తరగతుల్లో విద్యలో వెనుకబడి నసీ-గ్రేడ్‌ విద్యార్థులను గుర్తించారు. వారికి మాత్ర మే ఏఐ పాఠాలు అందించనున్నారు. ఏఐ పాఠాల కోసం ఓ ప్రత్యేక సంస్థ సహకారంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఏఐ పాఠాలు బోధించనున్నారు.

వెనకబడి వారి కోసం..

ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ ఏఎక్సల్‌ ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వారికి తెలుగు, గణిత అభ్యాసాలపై తరగతులు ఏర్పాటు చేయనున్నారు. ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా విద్యార్థులను ఆకట్టుకునేలా ఏఐ బోధన ఉంటుంది. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న కంప్యూటర్ల ఆధారంగా ఒక్కో కంప్యూటర్‌కు ఒక విద్యార్థిని ఎంపిక చే యనున్నారు. జిల్లాలో 100 మంది విద్యార్థులను ఒక బ్యాచ్‌గా ఏర్పాటుచేసి ఒక్కో బ్యాచ్‌కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై గంట వ్యవధి ఏఐ పాఠాలు భోధించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పాఠాలను సంబంధిత విద్యార్థి అర్థం చేసుకున్నాడా లేడా అనేది ఏఐ గుర్తించి అర్థం కాకపోతే అతడికి అర్థమయ్యేరీతిలో సరళమైన పద్ధతిలో బోధిస్తుంది. అర్థం అయిందంటే మరికొంత మెరుగైన పద్ధతిలో బోధన అందిస్తుంది. ఈ విధంగా ప్రతీ విద్యార్థి అభ్యాసనా సామర్థ్యాలను మదింపు చేయడంతో పాటు గతంతో పోలిస్తే ఆ విద్యార్థి పురోగతి ఎలా ఉందో పరిశీలించి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నారు.

ఏఐ బోధన కోసం ప్రత్యేక శిక్షణ

ఏఐ బోధన కోసం జిల్లాలో 68 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో బోధించేందుకు నిపుణులైన ఉపాధ్యాయులు, జిల్లా సమన్వయ అధికారులకు రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం జిల్లా కేంద్రాల్లో ఎంఈవోలు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంపిక చేసిన పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడి చొప్పున ఏఐ బోధనపై శిక్షణ అందిస్తారు.

విద్యార్థులకు ఎంతో మేలు : అశోక్‌కుమార్‌, డీఈవో

విద్యలో వెను కబడిన విద్యార్థులకు ఏఐ ద్వారా పా ఠాలు ఎంతో మేలు చేయనున్నాయి. గణితంలో బేసిక్స్‌ను ఏఐ పాఠాల ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల్లో కొంతమంది రాణించలేకపోతున్నా రు. అలాంటి వారికి ఏఐ పాఠాల ద్వారా మెరుగైన సామర్థ్యాలు సాధించే అవకాశం లే కపోలేదు. ఏఐ ద్వారా విద్యాభ్యాసన కోసం విద్యార్థులను గుర్తించి వారికి మాత్రమే అం దిస్తాం. అందుకోసం ఇప్పటికే పాఠశాలల కు కంప్యూటర్లు చేరాయి.

మండలం ఎంపికైన

పాఠశాలలు

అనంతగిరి 2

ఆత్మకూర్‌(ఎస్‌) 5

చిలుకూరు 2

చింతలపాలెం 1

చివ్వెంల 2

గరిడేపల్లి 3

హుజూర్‌నగర్‌ 6

అర్వపల్లి 2

కోదాడ 9

మఠంపల్లి 5

మేళ్లచెర్వు 2

నడిగూడెం 1

నాగారం 2

నేరేడుచర్ల 5

నూతన్‌కల్‌ 1

పాలకవీడు 1

పెన్‌పహాడ్‌ 1

సూర్యాపేట 9

తిరుమలగిరి 4

తుంగతుర్తి 5

Updated Date - Aug 18 , 2026 | 11:53 PM