సొంతూరిపై మమకారం
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:17 AM
మునుగోడు రూరల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామంలో తండ్రి, కుమార్తె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చేయూతనిచ్చారు.
మునుగోడు రూరల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామంలో తండ్రి, కుమార్తె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చేయూతనిచ్చారు. సొంతూరులో ప్రభుత్వ పాఠశాలపై ఉన్న మమకారం చాటారు. గ్రామానికి చెందిన మేరెడ్డి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రాథమిక పాఠశాలకు రెండు కంప్యూటర్లు ఉచితంగా అందజేశారు. అలాగే ఆయన కుమార్తె మేరెడ్డి అఖిల కంప్యూటర్ల ద్వారా విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేందుకు టీచర్‌ను నియమిస్తూ, నెలకు తన సొంతంగా రూ.5000 వేతనాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మేరెడ్డి కుటుంబ సభ్యులు చేయూతనందించడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఆయన కుమార్తె అఖిల హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చీమల రాజుయాదవ్, బూడిద లింగయ్యయాదవ్, ఆవుల శ్రీనివా్‌సయాదవ్, ప్రధానో పాధ్యాయుడు నాగేశ్వరరావు, బొజ్జ వెంకటేశ్వర్లు, బొజ్జ మహేశ్వరి, ఆడెపు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.