Share News

యాసంగి ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళికలు

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:35 AM

జిల్లాలో మరో నెల రోజుల్లో యాసంగి సీజన్‌ ధాన్యం దిగుబడి రానుండటంతో వీటి సేకరణకు అధికారులు అవసరమైన సన్నాహాలు చేస్తున్నా రు.

యాసంగి ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళికలు

3.15లక్షల ఎకరాల్లో వరిసాగు

6.92లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి అంచనా

330 ధాన్యం సేకరణ కేంద్రాలు

గన్నీ బ్యాగులు, గోదాముల లేమి ప్రధాన సమస్య

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): జిల్లాలో మరో నెల రోజుల్లో యాసంగి సీజన్‌ ధాన్యం దిగుబడి రానుండటంతో వీటి సేకరణకు అధికారులు అవసరమైన సన్నాహాలు చేస్తున్నా రు. గత సీజన్‌లో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా, సజావుగా ధాన్యం సేకరించి, మిల్లులకు తరలింపు, గోదాముల్లో నిల్వకు అవ సరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

జిల్లాలో ఏప్రిల్‌ రెండో వారం నుంచి రైతులు వరి కోతలు ప్రారంభించి ధాన్యాన్ని మార్కెట్లకు, కొనుగోలు కేంద్రాలకు తరలించే అవకాశాలు ఉన్నా యి. దీంతో ఈలోగా ధాన్యం సేకరణకు అవసరమై న మౌలిక వసతులు, సామగ్రిని సిద్ధం చేసుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కలెక్టర్‌ అనురాగ్‌జయంతి, అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డితో పాటు ఉన్నతాధికారులు ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడమే లక్ష్యంగా ముందుకుసాగాలని వారు సూచించారు.

6.92లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి

జిల్లాలో ప్రధాన పంట వరి. ఈ ఏడాది యాసంగిలో 3.15లక్షల ఎకరాల్లో వరిసాగైనట్టు వ్యవసాయశాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. దీని ప్రకారం 6.92లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యందిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 6.84లక్షల మెట్రిక్‌టన్నులు దొడ్డురకాలు కాగా, మ రో 8వేల టన్నుల సన్నాలు ఉంటాయని అంచనా. దిగుబడిలో రైతులవినియోగం, విత్తనాలకోసం 1.42 లక్షల మెట్రిక్‌టన్నులు మినహాయిస్తే మార్కెట్‌కు 5.50లక్షల మెట్రిక్‌టన్నులు రానుంది. అందులో మిల్లర్లు, ప్రైవేట్‌ ట్రేడర్లు సుమారు 1,00,000 మెట్రిక్‌టన్నులు కొనుగోలుచేస్తారని గత నివేదిక ప్రకా రం అధికారులు అంచనా వేశారు.మిగతా 4.50 లక్ష ల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

330 ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రతిపాదన

జిల్లాలోని 17 మండలాల పరిధిలో రైతుల నుం చి ధాన్యం సేకరణకు 330 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. వాటిలో దొడ్డు రకం ధాన్యం సేకరణకు 305, సన్నరకం సేకరణకు 25 కేంద్రాలు కేటాయిస్తున్నారు. ఇందిరాక్రాంతి పథం మహిళా సంఘాల ఆధ్వర్యం లో 134 దొడ్డురకాల కేంద్రాలు, 14 సన్నరకం, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో 154 దొడ్డురకం, 10 సన్నరకం, రైతు ఉత్పతి ్తదారుల సంస్థల ఆధ్వర్యంలో 14 దొడ్డు రకం, ఒక సన్నరకం, మెప్మా ఆధ్వర్యంలో మూడు దొడ్డురకాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించారు. వీటి నిర్వాహణ, ధాన్యం నాణ్యతా ప్రమాణాల నిర్ధారణ, నిల్వ, రవాణా, సేకరణ లెక్కలు, తదితర అంశాలపై జిల్లా ఉన్నతాధికారులు ఈ నెల మూడో వారం నుంచి ఐకేపీ, పీ ఏసీఎస్‌, మార్కెటింగ్‌ సిబ్బందికి శిక్ష ణ ఇవ్వనున్నారు.అదే విధంగా కొ నుగోలు కేంద్రాల్లో ధాన్యం సం చుల్లో నింపడం, కల్లాల్లో తూకం, లారీల్లో లోడింగ్‌కు అవసరమైన హమాలీలను సంబంధిత కేంద్రాల నిర్వాహకులు స్థానికంగానే సమకూర్చుకోనున్నారు.

కనీస సామగ్రి సమీకరణ

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు అవసరమైన కనీస యంత్రపరికరాలు, వర్షం నుంచి రక్షణకు అవసరమైన టార్పాలీన్లు సరిపడా అందజేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 330 ధాన్యం సేకరణ కేంద్రాలకు 16,050 టార్పాలిన్లు అ వసరం కాగా, ప్రస్తుతం 12,562 సిద్ధంగా ఉన్నాయి. మరో 3,488 టార్పాలిన్లు సమకూర్చనున్నారు. ధాన్యం నాణ్యత, తేమ శాతం నిర్ధారణకు మాశ్చయిజర్‌ మిషన్లు 600 అవసరం కాగా, 425 ఉన్నాయి. మరో 175 అవసరమని భావిస్తున్నారు. ధాన్యం తూకానికి ఎలకా్ట్రనిక్‌ కాంటాలు 993 అవసరం కాగా, 878 సిద్ధంగా ఉండగా, 115 అవసరం ఉంది. అదేవిధంగా మాన్యువల్‌ ప్యాడీ క్లీనర్లు పూర్తిస్థాయిలో 272 ఉండగా, ఆటో మేటిక్‌ క్లీనర్లు మరో 10 అవసరమని ప్రతిపాదించారు.

1.12కోట్ల గన్నీబ్యాగులకు ఉన్నవి 17.39లక్షలే

ధాన్యం సేకరణలో ఎదురయ్యే సమస్యల్లో గన్నీ బ్యాగుల కొరత ప్రధానమైంది. జిల్లాలో ధాన్యం సేకరణ అంచనాల ప్రకారం 1,12,50,000 గన్నీ బ్యాగులు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కేవలం 17,39,150 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రతీ సీజన్‌లో ధాన్యం సేకరణకు వినియోగించే గన్నీ బ్యాగుల్లో 54శాతం కొత్తవి, 46శాతం పాతవి వినియోగిస్తారు. దీని ప్రకారం ప్రస్తుతం కొత్త గన్నీ బ్యాగులు 60,75,000 అవసరం కాగా, 17,16,883 గోదాముల్లో ఉన్నాయి. అదే విధంగా పాత గన్నీ బ్యాగులు 51,75,000 అవసరం కాగా, కేవలం 22,267 గోదాముల్లో, 20లక్షలు మిల్లర్ల వద్ద సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా ఇంకా 43,58,117 కొత్త గన్నీబ్యాగులు, 31,52,733 పాత గన్నీబ్యాగులు సమకూర్చాల్సి ఉంది.

మిగులు ధాన్యం, గోదాముల కొరతే ప్రధాన సమస్య

జిల్లాలో ధాన్యం దిగుబడి, సేకరించే ధాన్యం పరిమాణానికి అనుగుణంగా మిల్లుల సామర్ధ్యంలేక మిగులు ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ కేటాయింపులు, ధాన్యం నిల్వకు సరిపడా గోదాములు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. జిల్లాలో సుమారు 4.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా గల 38 రైస్‌ మిల్లులు ఉండగా, వీటి మిల్లింగ్‌ సామర్ధ్యం 2.90లక్షల మెట్రిక్‌టన్నులు మాత్రమె. పౌరసరఫరాలశాఖ రైతుల నుంచి సేకరించే 4.50లక్షల మెట్రిక్‌టన్నుల్లో 1.60 మెట్రిక్‌టన్నుల ధాన్యం మిగులుగా ఉంటుంది. ఈ ధాన్యాన్ని గత సీజన్‌లో పొరుగు జిల్లాలకు కేటాయించడంతో సమస్య పరిష్కారం కాగా, ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం రవాణా పెద్ద సమస్యగా మారింది. అదే విధంగా ధాన్యాన్ని నిల్వ చేసే గోదాముల కొరత కూడా ప్రధానంగా పీడిస్తోంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి చెందిన 8, స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ గోదాము ఒకటి, ప్రైవేట్‌ గోదాము ఒకటి, మొత్తంగా 10 గోదాములు మాత్రమే ఉన్నాయి. వీటి నిల్వ సామర్ధ్యం 1,18,500 మెట్రిక్‌టన్నులు కాగా, ఇప్పటికే వాటిలో 53,507 మెట్రిక్‌టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి. మరో 64,993 మెట్రిక్‌టన్నుల ధాన్యం మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది. అయితే మిల్లర్ల వద్ద కూడా సామర్ధ్యానికి తగినట్టు గోదాముల సదుపాయం లేకపోవడం, సేకరించిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు గోదాముల సమస్య ప్రధాన అవరోధంగా మారనుంది. గోదాములు, మిల్లింగ్‌ సమస్య పరిష్కారంపై అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జిల్లాలో వరి సాగు, దిగుబడి, సేకరణ వివరాలిలా..

వరి సాగు విస్తీర్ణం : 3,14,621 ఎకరాలు

దొడ్డు రకం : 3,10,984 ఎకరాలు

సన్న రకం : 3,636 ఎకరాలు

ధాన్యం దిగుబడి : 6,92,116 మెట్రిక్‌ టన్నులు

దొడ్డు రకం : 6,84,116 మెట్రిక్‌ టన్నులు

సన్న రకం : 8,000 మెట్రిక్‌ టన్నులు

రైతుల వినియోగం : 1,42,116 మెట్రిక్‌టన్నులు

మార్కెట్‌కు వచ్చే ధాన్యం : 5,50,000 మెట్రిక్‌టన్నులు

మిల్లర్ల కొనుగోలు అంచనా : 1,00,000 మెట్రిక్‌టన్నులు

ఽపౌరసరఫరాలశాఖ సేకరణ : 4,50,000 మెట్రిక్‌టన్నులు

గన్నీ బ్యాగుల అవసరం : 1,12,50,000

అందుబాటులో ఉన్న గన్నీ బ్యాగులు : 37,39,150

ధాన్యం కొనుగోలు కేంద్రాలు : 330 (305 దొడ్డురకం, 25 సన్నరకం)

ఐకేపీ కేంద్రాలు : 148 (134 దొడ్డురకం, 14 సన్నరకం)

పీఏసీఎస్‌ కేంద్రాలు : 164 (154 దొడ్డురకం, 10 సన్నరకం)

ఎఫ్‌పీవో కేంద్రాలు : 15 (14 దొడ్డురకం, 1 సన్నరం)

మెప్మా కేంద్రాలు : 3 దొడ్డురకం

Updated Date - Mar 10 , 2026 | 12:35 AM