Share News

‘ఆధార్‌’ కష్టాలు

ABN , Publish Date - May 29 , 2026 | 12:15 AM

మండల కేంద్రంలో ఆధార్‌ సేవా కేంద్రం లేకపోవడంతో 34 గ్రామాల ప్రజ లు నానాఅవస్థలు పడుతున్నారు. చిన్నపాటి ఆధార్‌ సవరణల కో సం కూడా నల్లగొండ, నకిరేకల్‌, సూర్యాపేట లేదా హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందని పలువురు వాపోయారు.

‘ఆధార్‌’ కష్టాలు

మండల కేంద్రంలో ఆధార్‌ సేవా కేంద్రం లేకపోవడంతో 34 గ్రామాల ప్రజ లు నానాఅవస్థలు పడుతున్నారు. చిన్నపాటి ఆధార్‌ సవరణల కో సం కూడా నల్లగొండ, నకిరేకల్‌, సూర్యాపేట లేదా హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందని పలువురు వాపోయారు. 24 రెవెన్యూ గ్రామా లు, 10 ఆవాస గ్రామాలు ఉన్న శాలిగౌరారం మండలంలో ఒక్క ఆధార్‌ సెంటర్‌ కూడా లేదు. దీంతో ఆధార్‌ కొత్తగా తీసుకోవడం, మొబైల్‌ నెంబర్‌ లింక్‌, అడ్రస్‌ మార్పు, పుట్టిన తేదీ సవరణ, బయోమెట్రిక్‌ అప్డేట్‌ వంటి పనులన్నింటికీ జిల్లా కేంద్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఒక్కోసారి సర్వర్‌ డౌన్‌, లైన్‌ ఎక్కువగా ఉండటంతో రెండు మూడు రోజులు తిరిగినా పని కావడం లేదని ప్రజ లు వాపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, విద్యార్థులు, రోజువారీ కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. బ్యాంకు ఖాతా, రేషన్‌, పింఛన్‌, స్కాలర్‌షిప్‌, పాస్‌పోర్ట్‌, సిమ్‌ కార్డు, భూ రిజిస్ట్రేషన్‌, ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్‌ పనికీ ఆధార్‌ తప్పనిసరి కావడంతో ఆధార్‌ సెంటర్‌లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, మీసేవ కేంద్రం ఉన్నా ఆధార్‌ సేవలు అందుబాటులో లేకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

శాశ్వత ఆధార్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి

ఆధార్‌ కార్డులో ప్రతీ చిన్న అప్డేట్‌కు నల్లగొండ, హైదరాబాద్‌ తిరగాలంటే కూలి మానుకోవాలి. రూ.500 ఖర్చు అవుతుంది. పేదోళ్లం ఎన్నిసార్లు తిరగాలి. మండలంలోనే కేంద్రం ఏర్పాటు చేస్తే మా కష్టాలు తీరతాయి. కలెక్టర్‌, సంబంధిత శాఖ అధికారులు స్పం దించి శాలిగౌరారం మండల కేంద్రంలో శాశ్వత ఆధార్‌ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- దునక వెంకన్న, శాలిగౌరారం

Updated Date - May 29 , 2026 | 12:15 AM