Share News

బస్తాకు..కిలోకు పైగా తరుగు

ABN , Publish Date - May 27 , 2026 | 11:54 PM

మద్దిరాల, మే 27(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించడానికి నానా రైతులు కష్టాలుతప్పడం లేదు.

  బస్తాకు..కిలోకు పైగా తరుగు

మద్దిరాల, మే 27(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించడానికి నానా రైతులు కష్టాలుతప్పడం లేదు. నిప్పుల కొలిమి లాంటి ఎండలో సైతం లారీలకొరతతో రైతులు ధాన్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తుంది.అధికారులు, నిర్వాహకులతో కుమ్మకై రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. కొందరు రైతులు సైతం నిర్వాహకులు, అధికారులను ప్రశ్నిస్తున్నప్పటికీ దోపిడీ మాత్రం ఆగడం లేదని రైతులు పేర్కొంటున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో ఎలాంటి గాలి దూమారం, వానలు పడిన దాఖలాల లేవు. అయినప్పటికీ తరుగు పేరుతో మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. రైతులు అడిగితే అధికారులువీవోఏలను అడగాలని చెబుతున్నారని రైతులు తెలిపారు. కొందరు రైతులు సైతం అధికారులతో వాగ్వాదానికి దిగిన సంఘటనలు సైతం ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తా ను తూకం వేసే సమయంలో ప్రభుత్వ నిబంధనల అనుగుణంగానే తూకం వేసి లారీల్లోకి ఎగుమతి చేస్తారు. మిల్లర్ల వద్దకు లారీలు వెళ్లగానే తరుగు తీస్తున్నామని రైతులకు తెలియపరుస్తున్నారు. బస్తాకు 40 కిలోల 700 గ్రాములు తూకం వేయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో బస్తా తూకం కేజీ పావు తరుగు ముందుగానే తీసి వేసి తూకం వేసి లారీలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక లారీలో నలుగురు రైతుల 697 ధాన్యం బ స్తాలను ఎగుమతి చేయగా 14బస్తాల తరుగు చూపిస్తూ రైతులను నిండా ముంచుతున్నారు.

ట్రక్‌ షీట్‌లో నింపిన తూకానికి మిల్లర్ల వద్ద వే బ్రిడ్జి వేసిన తూకానికి పొంతన ఉండడంలేదని పలువురు రైతులు తెలిప ారు. ఒక రైతుకు సుమారుగా క్వింటా నుంచి రెండు క్వింటాల మధ్యలో అదనపు తరుగు కింద తీసేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు సైతం నిర్వాహకులతో మాట్లాడుకోవాలని సూచిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Updated Date - May 27 , 2026 | 11:54 PM