Share News

ఆరంభంలోనే హంసపాదు

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:47 AM

వర్షాకాలం ఆరంభ మాసం జూన్‌ అన్నదాతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. జూన్‌ మా సంలో నైరుతి రుతుపవనాలు కమ్ముకొని ము మ్మరంగా వర్షాలు కురవాల్సి ఉండగా, వరుణు డు ముఖం చాటేశాడు.

ఆరంభంలోనే హంసపాదు

వర్షకాలం సీజన్‌లో 31మి.మీ లోటు

జూన్‌ సాధారణ వర్షపాతం 99.2మి.మీ

కురిసింది 68.2మి.మీ మాత్రమే

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): వర్షాకాలం ఆరంభ మాసం జూన్‌ అన్నదాతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. జూన్‌ మా సంలో నైరుతి రుతుపవనాలు కమ్ముకొని ము మ్మరంగా వర్షాలు కురవాల్సి ఉండగా, వరుణు డు ముఖం చాటేశాడు. జూన్‌ మాసం నుంచి సెప్టెంబరు వరకు వానాకాలం సీజన్‌ కాగా, తొ లి మాసంలోనే లోటు వర్షపాతం నమోదైంది.

వరుసగా దశాబ్దకాలంగా సీజన్‌ ప్రారంభంలోనే ఉధృతంగా వర్షాలు కురిసి పంటల సాగు కు ప్రకృతి కరుణించేంది. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా రుతుపవనాల స్తంభనతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో జూన్‌ మాసం సాధారణ వర్షపాతం 99.2మి.మీ కాగా, ఈ 30 రోజుల్లో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురిశాయి. ఈ నెలలో 68.2 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. మొ త్తంగా 31మి.మీ వర్షపాతం లోటు నమోదైంది. ఎనిమిది వర్షపు రోజులను మినహాయిస్తే మిగతా 22 రోజులు ఎండలు దంచికొట్టాయి.

10 మండలాల్లో లోటు, అతి లోటు వర్షాలు

జిల్లాలోని 17 మండలాలకు 10 మండలాల్లో వర్షాల జాడేలేదు. ఈ మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ, అతి తక్కువ వర్షం కురిసింది. కేవలం నాలుగు మండలాల్లో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైంది. మూడు మండలాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురిశా యి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు లేక కరువు ఛాయలు కన్పిస్తున్నాయి. తుర్కపల్లి, రాజాపేట, భువనగిరి, బీబీనగర్‌ మండలాల్లో అతిలోటు వర్షపాతం నమోదైంది. ఆలేరు, మో టకొండూరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, రామన్నపేట మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. బొమ్మల రామారం, చౌటుప్పల్‌, ఆత్మకూర్‌(ఎం), మోత్కూరులో మోస్తరు వర్షాలు కురియడంతో సాధారణ వర్షపాతం నమోదైంది. మి గిలిన నారాయణపూర్‌, వలిగొండ, అడ్డగూడూ రు మండలాల్లో ఒకటి,రెండు మోస్తరు వర్షాలు కురియడంతో స్వల్ప అధిక వర్షపాతం నమోదైంది. స్థూలంగా ఈ ఏడాది వర్షాకాలం సీజన్‌ ప్రారంభ మాసం జిల్లావ్యాప్తంగా లోటు వర్షపాతంతో అన్నదాతలను నిరాశకు గురిచేసింది.

పంటల సాగుపై తీవ్ర ప్రభావం

జిల్లాలో సాధారణం కంటే మూడో వంతు లోటు వర్షపాతం కారణంగా పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. అంతేగాక భూగర్భ....

జలాలు పడిపోయి బోర్లు, బావుల్లో నీరు అడుగంటింది. భూగర్భజలాధారంగా సాగుచేసే వరికి రైతులు నార్లు పోసి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాధారంగా సాగుచేసే పత్తి పైర్లు వర్షపు తడిలేక దుక్కులు సాగడం లేదు. పొడిదుక్కల్లో విత్తిన విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. మళ్లీ విత్తడానికి అవసరమైన వర్షాలు లేక రైతులు బిక్కముఖం వేశారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో .......... లక్షల ఎకరాల సాగు అంచనాలకు జూన్‌ చివరి నాటికి రెండు శాతం కూడా పంటలు సాగుకాలేదు. వర్షాలు కురిస్తే వరి నాట్లు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా సుమారు 7వేల ఎకరాల్లో నారుమడులు సిద్ధంగా ఉన్నాయి. వరి నాట్లు 5వేల ఎకరాలకు మించలేదు. పత్తి పైరు 1.40లక్షల ఎకరాల సాగు అంచనా కాగా, 15వేల ఎకరాలకు మించి విత్తనాలు విత్తలేదు. విత్తిన పైర్లు సైతం వర్షాలు లేక తడారి భూమిలోనే మాడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రత్యామ్నాయంగా సాగుచేసిన ఉద్యాన పంటలకు కూడా నీరందక మొక్కల ముఖం వాడుతున్నాయి. ప్రధానంగా ఆయిల్‌పామ్‌ తోటలకు నీరందక వాడిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే సరైన తడి ఉన్నప్పుడే పంటలు సాగు చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

జిల్లాలో జూన్‌ మాసం వర్షపాతం ఇలా..

సాధారణ వర్షపాతం : 99.2మి.మీ

నమోదైన వర్షపాతం : 68.2మి.మీ

లోటు వర్షపాతం : 31మి.మీ

మండలాల వారీగా ఇలా..

అతిలోటు వర్షం: తుర్కపల్లి, రాజాపేట, భువనగిరి, బీబీనగర్‌, గుండ్లపల్లి

లోటు వర్షం: ఆలేరు, మోటకొండూరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, రామన్నపేట

సాధారణ వర్షం: బొమ్మలరామారం, చౌటుప్పల్‌, ఆత్మకూర్‌(ఎం), మోత్కూరు

సాధారణానికి మించి: నారాయణపూర్‌, అడ్డగూడూరు, వలిగొండ

Updated Date - Jul 01 , 2026 | 12:47 AM