దయ్యాలగండి.. ప్రమాదాలు దండి
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:07 AM
(ఆంధ్రజ్యోతి-నాగార్జునసాగర్): నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై సాగర్ సమీపంలో ఉన్న దయ్యాలగండి నుంచి ప్రాజెక్టు వరకు మూల మలుపులు ప్రమాదకరంగా మారాయి.
(ఆంధ్రజ్యోతి-నాగార్జునసాగర్): నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై సాగర్ సమీపంలో ఉన్న దయ్యాలగండి నుంచి ప్రాజెక్టు వరకు మూల మలుపులు ప్రమాదకరంగా మారాయి. సాగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో సమ్మక్క-సారక్క జంక్షన్ నుంచి ఫైలాన్ కాలనీ వరకు కిలోమీటర్లు ఉండగా 8 మూల మలుపులు ఉండగా రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఈ మలుపుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ ఎక్కువ ప్రమాదాలు జరిగింది మాత్రం దయ్యాలగండివద్దనే. దయ్యాలగండి వద్ద మూల మలుపుతో పాటు రోడ్డుకు దగ్గరగా చెట్లు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 15 ఏళ్లలో దయ్యాలగండిబవద్ద 32 ప్ర మాదాలు జరగగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 23 మంది క్షతగాత్రులయ్యారు. దయ్యాలగండి పేరు చెప్పితే అమ్మో దయ్యాలగం డా అని ప్రజలు భయపడుతున్నారు. సాగర్‌కు వచ్చి తిరిగి వెళ్లే పర్యాటకులు తమ గమ్యస్థానాలకు చేరుకోకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు.
విస్తరణకు నోచని రోడ్డు
సాగర్‌కు వెళ్లే దారిలో ఉన్న మూల మలుపులు సరిచేసి రోడ్డును విస్తరించడానికి అటవీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఇక్కడ రోడ్డు ఇరుకుగా కూడా ఉంటుంది. రోడ్డుకు అడ్డుగా పెరిగిన చెట్లను బీఅండ్‌ఆర్ అధికారులు చెట్లను తొలగించకపోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ రోడ్డు దిగుడుగా(డౌన్) ఉంటుంది. రోడ్డు పక్కనే ప్రమాదాల నివారణకు దయ్యాలగండి వద్ద ప్లైఓవర్ వేస్తే అటవీ శాఖకు ఎటువంటి నష్టం ఉండదు, అలాగే రోడ్డు కూడా వెడల్పుగా చేయవచ్చునని నిపుణులు చెపుతున్నారు. అవసరమైన చోట ప్లై ఓవర్ వేయకుండా అవసరం లేని చోట సమ్మక్క-సారక్క వద్ద ఫ్లై ఓవర్ వేయ డం ఉపయోగం లేని పని అని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదకరంగా ‘కోటమైసమ్మ’ మూలమలుపు
నిడమనూరు : మండలంలోని ముకుందాపురం నుంచి కోటమైసమ్మ ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న మూలమలుపు ప్రమాదకరంగా మారింది. ఈ మూ లమలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది మృత్యువాత పడుతుండటంతో పాటు అనేక మంది క్షతగాత్రులవుతున్నారు. ఈ రహదారి వెంటే ముదిమాణిక్యం మేజర్ కాల్వ ఉంటుంది. మూలమలుపు వద్ద తరచూ వాహనాలు కాల్వలోకి దూసుకెళ్లిన సంఘటనల్లో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నిడమనూరు, దామరచర్ల, అడవిదేవులపల్లి, తిరుమలగిరిసాగర్ మండలాల్లోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఈ రహదారి మీదుగా ప్రయాణం చేస్తుంటారు. పైగా ఇక్కడే ప్రసిద్ధ కోటమైసమ్మ ఆలయం కూడా ఉండటంతో నిత్యం రహదారి ఎంతో రద్దీగా ఉం టుంది. ఈ రహదారిని హ్యామ్ నిధులతో ముకుందాపురం నుంచి కోటమైసమ్మ ఆలయం మీదుగా నేతాపురం, తిరుమలగిరి ఎక్స్ రోడ్డు వరకు విస్తరించనున్నట్లు అఽధికారులు ప్రకటనలు చేసినప్పటికీ ప్రతిపాదనలు మూడేళ్లుగా కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. రహదారిని తక్షణమే విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కోటమైస మ్మ మూలమలుపు వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అదుపు తప్పితే.. అంతే సంగతి
ఫ సీసీ రోడ్ల మధ్య మట్టి ఇసుకతో ఇబ్బందులు
కొండమల్లేపల్లి, అక్టోబరు 23 (ఆంధ్ర జ్యోతి) :మండల కేం ద్రంలోని నల్లగొండ రోడ్డులో మూడేళ్ల క్రితం రెండు వైపులా సీసీ రోడ్లు నిర్మించారు. ఆయా రోడ్ల మధ్య డివైడర్ నిర్మాణానికి స్థలానికి వదిలేశారు. దీంతో రోడ్ల మధ్యలో ఉన్న డివైడర్ నిర్మించక పోవడం, మట్టి పోయక పోవ డంతో గుంతలుగా ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సర్పంచ్ ఇంటి ఎదుట ఉన్న రోడ్డు మధ్య డివైడర్లు గ్రామపంచాయతీ సిబ్బంది రోడ్డుపై ఉన్న ఇసుక మట్టిని ఊడ్చి గ్రామ శివారులో పోయాల్సిన మట్టిని రోడ్ల మధ్యన పోయడం అది ఇసుకగా ఉండడంతో యూ టర్న్ తీసుకునే సమయంలో వాహనాలు అదుపు తప్పు తున్నాయి. మొరం మట్టిని తెచ్చి పోయాల్సిన పంచాయతీ సిబ్బంది రోడ్డుపై ఊడ్చిన మట్టి పోయడమేంటని స్థానికులు విమర్శిస్తున్నారు.