Share News

భువనగిరి గురుకులానికి పతకాల పంట

ABN , Publish Date - Mar 27 , 2026 | 11:58 PM

భువనగిరి టౌన్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి): భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.

 భువనగిరి గురుకులానికి పతకాల పంట

భువనగిరి టౌన్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి): భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఇటీవల జరిగిన వేర్వేరు జాతీయ స్థాయి పోటీల్లో ఇద్దరు విద్యార్థులకు జాతీయ కళా అవార్డులు దక్కగా 9 స్వర్ణ, 10 రజత, 5 కాంస్య మొత్తం 24 పతకాలు లభించాయి. 2025-26 విద్యాసంవత్సరానికి ఇటీవల విజయవాడలో నిర్వహించిన 12వ జాతీయస్థాయి యూత్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ ఆర్ట్‌ కాంపిటేషన్‌ కమ్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న 14మంది విద్యార్థులకు పతకాలు సాధించారు. ఎం.హర్షవర్థన్‌ (8వ తరగతి), బి.భానుప్రసాద్‌ (9వ తరగతి)కు జాతీయ బాల చత్రకళ అవార్డులు లభించా యి. అభినాష్‌ (ఇంటర్‌ ప్రథమ), టి.అవినాష్‌ (8వ), బి.జశ్వంత్‌ (9వ) ఎ.దుర్గ ప్రసాద్‌(9వ) జె.జశ్వంత్‌ (8వ) బంగారు పతకాలు సాధించారు. కె.రిషి (5వ), జి.సాకేత్‌ (5వ), ఎస్‌.రాజన్య(6వ), వి.మునీష్‌ (6వ), ఎం.బన్నీ (6వ) సీహెచ్‌ ప్రణీత్‌ ఠాగూర్‌(6వ), రాహుల్‌ (6వ) రజత పతకాలు సాధించారు. అలాగే హై దరాబాద్‌లో జరిగిన ఫేస్‌ ఆఫ్‌ ఇండియా నేషనల్‌ లెవల్‌ టాలెంట్‌ సెర్చ్‌ కాం పిటీషన్‌ (కలరింగ్‌)లో 12పతకాలు సాధించారు. జూనియర్‌ విభాగంలో కె.కృష్ణ చైతన్య(5వ), జి.బన్నీ (6వ), బి.హర్ష(7వ)స్వర్ణ పతకాలు సాధించారు. డి.దీక్షిత్‌ కుమార్‌ (7వ),కె అవినాష్‌ (6వ)కు రజత పతకాలు దక్కాయి. డి.గౌతమ్‌ (7), బి.హర్షవర్థన్‌(6వ), ఎం.నివా్‌స(6వ)కు కాంస్య పతకాలు లభించాయి. సీనియర్‌ విభాగంలో ఎ.అజయ్‌ 9వ), స్వర్ణ ,జి చైతన్య (9వ) రజత, ఎం.హర్షవర్థన్‌ (8వ), సందీప్‌ (8వ) కాంస్య పతకాలు సాధించారు. ఈమేరకు గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ట్‌ టీచర్‌ లింగా రమేశ్‌, పతకాలు సాధించిన విద్యార్థులను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ వెంకన్న అభినందించి సత్కరించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.శ్యాంబాబు, బి.బాలకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 11:58 PM