Share News

ప్రాణం తీసిన ఆట సరదా

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:32 AM

నల్లగొండటౌన, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): సరదాగా ఆడుకునేందుకు కాల్వ కట్టకు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తూ జారి పడి మృతి చెందాడు.

ప్రాణం తీసిన ఆట సరదా

నల్లగొండటౌన, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): సరదాగా ఆడుకునేందుకు కాల్వ కట్టకు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తూ జారి పడి మృతి చెందాడు. ఆదివారం నల్లగొండ మండలం ఆర్జాలబావి గ్రామ శివారులో ఈ సంఘటన జరిగింది. నల్లగొండ రూరల్‌ ఎస్‌ఐ సైదాబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ పట్టణంలోని విద్యుతనగర్‌కు చెందిన పర్వతం కిరణ్‌సాయి(12) పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో కిరణ్‌సాయి తన స్నేహితుడైన అదే కాలనీకి చెందిన త్రివిక్రమ్‌తో కలసి ఆడుకునేందుకు ఆర్జాలబావి గ్రామ శివారులోని ఎస్‌ఎ్‌సబీసీ కాల్వ వద్దకు వెళ్లాడు ఇద్దరూ కలిసి ఆడుకుంటుండగా కిరణ్‌సాయి ప్రమాదవశాత్తూ జారి కాల్వలో పడిపోయాడు. కెనాల్‌లో నీరు ప్రవహిస్తుండటంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న కొందరు గమనించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని కాల్వలో గాలించగా, పడిన చోటు నుంచి కొద్ది దూరంలో కిరణ్‌సాయి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీయించారు. మృతుడి తండ్రి పర్వతం వేణుగోపాలాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదాబాబు తెలిపారు.

Updated Date - Mar 30 , 2026 | 12:32 AM