Share News

పట్టణాల్లో 77.. గ్రామాల్లో 100 ు

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:16 AM

సూర్యాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో మార్కెట్‌ భూ విలువలు భారీగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాం తాల్లో పెరిగిన భూముల ధరలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. శుక్రవారం సూర్యాపేట రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 48 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి.

పట్టణాల్లో 77.. గ్రామాల్లో 100 ు

భారీగా పెరిగిన భూవిలువ, పెరిగిన ధరలతో రిజిస్ట్రేషన్లు షురూ

(ఆంధ్రజ్యోతి,భానుపురి): సూర్యాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో మార్కెట్‌ భూ విలువలు భారీగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాం తాల్లో పెరిగిన భూముల ధరలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. శుక్రవారం సూర్యాపేట రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 48 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. గ్రామీణ ప్రాం తాల్లో భూ విలువ సుమారు 80 నుంచి 100 శాతం మేర పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో 50 నుంచి 77శాతం వరకు పెరిగాయి. సూర్యాపేట లో కమర్షియల్‌ ప్లాట్లకు(రోడ్ల వెంట) విలువ ఎక్కువగా పెరిగింది.

సూర్యాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో 11 మండలాలు, రెండు మునిసిపాలిటీలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాట్ల ధర లు చదరపు గజానికి రూ.300 నుంచి రూ.600 కు పెరిగింది. గజానికి రూ.500 ఉన్న ధర రూ.900 వరకు భూ విలువను పెంచారు. సూ ర్యాపేట మునిసిపాలిటీ పరిధిలో గజానికి పాత ధర రూ.3,100 నుంచి రూ.5,500 వరకు పెరిగింది. రూ.5,800 ధర రూ.10,200, రూ.7,800 ఉన్న చోట రూ.11,700 వరకు విలు వ పెరిగింది. కమర్షియల్‌(రోడ్లు) వెంట ఉన్న స్థలాల విలువ రూ.14,200 నుంచి రూ.21,300 కు, రూ.26,400 ఉన్న చోట రూ.33,000 వరకు విలువ పెరిగింది. శుక్రవారం నుంచే ఈ విలువలు అమలులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతా ల్లో అపార్టుమెంట్ల విలువఎస్‌ఎ్‌ఫటీ రూ.1,300 నుంచి రూ.1,600 వరకు, పట్టణ ప్రాంతంలో రూ.1,500 నుంచి రూ.1800 వర కు, రూ.2,000 ఉన్న చోట రూ.2400 వరకు పెరిగింది.

పట్టణంలో కేకే క్రాస్‌రోడ్డు నుంచి న్యూ బస్టాండ్‌ ఏరియా, ఈద్గారోడ్‌ నుంచి న్యూ బస్టాండ్‌ ఏరియాలో భూమి విలువ రూ.33,000 వరకు పెరిగింది. అదే విధంగా ఈద్గా రోడ్డు నుంచి సీసీ బ్యాంక్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, కృష్ణకాలనీ బ్రిడ్జి ఏరియా, సీసీ బ్యాంక్‌ నుంచి పాత జాతీయ రహదారి ప్రాంతం వరకు, మార్కెట్‌రోడ్డు, అలంకార్‌రోడ్డు, ఈద్గారోడ్డు, కృష్ణకాలనీ బ్రిడ్జి నుంచి జగ్జీవన్‌రాం విగ్రహం ఏరియా, పీఎ్‌సఆర్‌సెంటర్‌ (పాత జాతీయ రహదారి), ఫ్లవర్‌ సెంటర్‌ నుంచి అలంకార్‌ సెంటర్‌ రోడ్డు, మునిసిపల్‌ ఆఫీ్‌సరోడ్డు ఏరియా, అర్వపల్లి నిర్మలా హౌస్‌ ఏరియా, సీసీ బ్యాంక్‌ నుంచి పోస్టాఫీస్‌ ఏరియా వరకు భూమి విలువ రూ.21,300కు పెరిగింది. అదేవిధంగా రూ.11,700 విలువ పెరిగిన ప్రాంతాలుగా పీఎ్‌సఆర్‌ సెంటర్‌ నుంచి తేజ మూవీ వెనుక ప్రాంతం, ఫైర్‌స్టేషన్‌ నుంచి డీసీసీ బ్యాంక్‌ రోడ్డు, కృష్ణకాలనీ నుంచి జగజ్జీవన్‌రాం విగ్రహ క్రాస్‌రోడ్డు, ఎస్వీకాలేజీ నుంచి తాడ్‌బన్‌, తాడ్‌బన్‌ నుంచి ఫైర్‌స్టేషన్‌ ఏరియా, తేజ మూవీ మ్యాక్స్‌ బ్రిడ్జి నుంచి ఎలక్రికల్‌ సబ్‌స్టేషన్‌ ఏరియా, ఫైర్‌స్టేషన్‌ నుంచి సీసీ బ్యాంక్‌ (పాత జాతీయ రహదారి) ఎలక్రికల్‌ సబ్‌స్టేషన్‌ నుంచి విజయకాలనీ, కృష్ణ కాలనీ నుంచి జనగాంక్రా్‌సరోడ్డు, తదితర ప్రాంతాలు ఉన్నాయి. రూ.10,200 పాత జాతీయ సెంటర్‌ నుంచి బొడ్రాయి బజార్‌ ఏరియా, వెంకటేశ్వర్‌ టెంపుల్‌రోడ్డు, అలంకార్‌టాకీస్‌ రోడ్డు వెనుక, జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి కుడకుడరోడ్డు, తదితర ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా రూ.5,500 విభాగంలో హనుమాన్‌ టెంపుల్‌ ఏరియా, న్యూబస్టాండ్‌ నుంచి మూసీ కెనాల్‌ బ్యాక్‌ సైడ్‌, ప్రకృతి ఆస్పత్రి ఏరియా, వేంకటేశ్వరకాలనీ, న్యూవిజన్‌ స్కూల్‌ ఏరియా, రామకృష్ణ, శ్రీరాంనగర్‌ వెనుక భాగం, అంబేడ్కర్‌నగర్‌, బలరాంతండా, న్యూమార్కెట్‌ ఏరియా, హౌసింగ్‌బోర్డు, తదితర ప్రాంతాలు ఉన్నాయి.

పెరిగిన ధరలతో రిజిస్ట్రేషన్లు : మహేందర్‌రెడ్డి, సూర్యాపేట సబ్‌ రిజిస్ట్రార్‌, సూర్యాపేట

కొత్త భూ విలువలతో శుక్రవారం సూర్యాపేటలో 48 రిజిస్ట్రేషన్లు చేశాం. జిల్లా కేంద్రంలో రెండు నుంచి మూడు ప్రాంతాల్లోనే రూ.33వేలు గజం ధర ఉంది. మిగతా ప్రాంతాల్లో సాధారణంగానే ధరలు పెరిగాయి. ఎక్కువ ప్రాంతాలు రూ.3,100 నుంచి రూ.5,500 విభాగంలో ఉన్నాయి.

Updated Date - Jun 06 , 2026 | 12:16 AM