మొదటి రోజే 431 మంది గైర్హాజరు
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:15 AM
జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి ఫస్టియర్ లాంగ్వేజ్‌కు సంబంధించి తెలుగు, సంస్కృతం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
సూర్యాపేట అర్బన, కోదాడ, నేరేడుచర్ల, తుంగతుర్తి, హుజూర్‌నగర్, మఠంపల్లి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి ఫస్టియర్ లాంగ్వేజ్‌కు సంబంధించి తెలుగు, సంస్కృతం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. జనరల్ విభాగంలో 7,167 విద్యార్థులకు 6,907 మంది హాజరు కాగా, 257మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,667 మందికి 1,493 మంది హాజరుకాగా 174 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో భానునాయక్ తెలిపారు. ఉదయం నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ప్రభుత్వం విధించిన ఐదు నిమిషాల గడువుపై అవగాహన ఉండటంతో విద్యార్థులు గడువు సమయానికి ముందే కేంద్రాల వద్దకు చేరుకుని వేచి చూశారు. హాల్ టికెట్లను సరిచూసుకొని, నిబంధనల ప్రకారం గదుల్లోకి ప్రవేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఆయా మండలాల్లోని పరీక్షా కేంద్రాల నిర్వహణను పరిశీలించారు. ఇదిలా ఉండగా సూర్యాపేటలోని నారాయణ జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వహణను ఎస్పీ కొత్తపల్లి నర్సింహ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన అమలు చేస్తున్నామన్నారు. ఆయన వెంట పట్టణ సీఐ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ ఇనస్పెక్టర్ రామారావు, ఎస్‌ఐలు శివతేజ, మహేంద్రనాథ్ పాల్గొన్నారు.