28కౌన్సిలర్లు.. మూడు గ్రూపులు
ABN , Publish Date - May 29 , 2026 | 12:19 AM
హుజూర్‌నగర్ పట్టణంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. మునిసిపల్ ఎన్నికలలో గెలిచిన కౌన్సిలర్లలో ఆధిపత్య పోరు మొదలైంది.
ఆరుగురు నేతల మధ్య ఆధిపత్య పోరు
వివాదాస్పదంగా సీతారాంనగర్ భూవివాదం
ఒకరిపై ఒకరు ఫిర్యాదులు
స్థానిక నాయకుల మధ్య మనస్పర్థలు
(ఆంధ్రజ్యోతి - హుజూర్‌నగర్): హుజూర్‌నగర్ పట్టణంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. మునిసిపల్ ఎన్నికలలో గెలిచిన కౌన్సిలర్లలో ఆధిపత్య పోరు మొదలైంది. ప్రధానంగా ఎన్నికలకు దూరంగా ఉన్న నాయకులు, గెలిచిన నాయకులు ఒకరిపై మరొకరు ఆధిప త్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 28 మంది కౌన్సిలర్లు మూడు గ్రూపులుగా ఆధిపత్యం చెలాయింపునకు ప్రయత్నిస్తున్నారు.
హుజూర్‌నగర్ మునిసిపాలిటీలోని 28 వార్డుల్లో సగం వార్డులకు పైగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటిచేసిన అభ్యర్థు లు గెలుపొందారు. మరికొందరు ఓటమిపాలయ్యా రు. గెలిచిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో మూడు గ్రూపులుగా విడిపోయారు. ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కాగా మునిసిపాలిటీలో మూడు పువ్వులు, ఆరు కాయలు గా వర్థిల్లుతున్నారు. ఈ మూడు గ్రూపులకు సంబంధించి ఆరుగురు నాయకులు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం పెద్ద పైరవీలే చేశారు. టికెట్ ఇచ్చేది అధిష్ఠానం అయి నా సలహాలు, సూచనల కోసం కమిటీలు వేశారు. కాగా ఈ కమిటీ నేతృత్వంలో రాజకీయ పరమైన అంశాలు నిర్వహించారు. కాగా ఒక ప్రాంతంలోని నాయకులు మరో ప్రాంతంలో పోటీ చేశారు. ఈ సమయంలో స్థానిక నాయకుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయినా అధిష్ఠానం సూచనలతో అప్పుడు సద్దుమణిగినా స్థానికుల మధ్య మనస్పర్థలు అలాగే ఉండిపోయాయి.
కౌన్సిలర్లపై వేధింపులు?
మునిసిపల్ ఎన్నికలలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరి ప్రజాప్రతినిఽధిగా కొనసాగుతున్న వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలోనే అధిష్ఠానం టికెట్ ఇచ్చినా అతడిని ఓడిస్తామంటూ కొందరు సవాల్ చేసినట్లు తెలిసింది. కాగా తీరా ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి పట్టణంలోని అనేక చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు రెబల్స్‌ను పోటీలో దింపి సుమారు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు ఒక ప్రజాప్రతినిధిపై ఆరోపణలు ఉన్నాయి. అయినా అంగబలం, ఆర్థిక బలంతో పదవులు పొందిన నాయకులు గెలిచిన కౌన్సిలర్లను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజా ప్రతినిధిగా సమస్యలు మాట్లాడేందుకు వచ్చిన కౌన్సిలర్లను రావద్దంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది కౌన్సిలర్లను లక్ష్యంగా చేసుకుని పాలకవర్గంలోని ఒక ముఖ్యనేత రాజకీయ విమర్శలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలలో గెలిచిన నాలుగు నెలల నుంచి ఒక ప్రజాప్రతినిధి తన చేష్టలతో పాలకవర్గ సభ్యుల గౌరవాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదిఏమైనా హుజూర్‌నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడిందని నాయకులు పేర్కొంటున్నారు. కౌన్సిలర్లపై కొంతమంది నాయకులు పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మునిసిపల్ పాలకవర్గంలో ఒక్కటిగా పరిపాలన చేయాల్సిన నాయకత్వం విభజించు, పాలించు అన్న చందంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆ భూవివాదామే కారణమా?...
హజూర్‌నగర్ పట్టణంలోని 25, 26 వార్డుల పరిధిలోని సీతారాంనగర్ కాలనీలోని సర్వే నెం. 135, 138లకు సంబంధించిన స్థలం వివాదాస్పదంగా మారింది. సుమారు 2వేల గజాలకు సం బంధించి వివాదం కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. దీని విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుంది. గడిచిన పదేళ్ల రాజకీయ పరమైన విభేదాలు మొత్తం మునిసిప ల్ ఎన్నికల అనంతరం వెలుగుచూస్తున్నాయి. ఒకప్పుడు బీఆర్‌ఎ్‌సలో ఉన్న నాయకులు ఇప్పుడు కాంగ్రె్‌సలో చేరి అధిష్ఠానానికి సన్నిహితంగా మెలుగుతున్నారు. కొంతమంది కౌన్సిలర్లుగా ఎన్ని క కావడంతో విభేదాలు కాస్తా ముదిరి పాకానపడ్డాయి. మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు నాలుగేళ్ల క్రితం సీతారాంనగర్‌లో నాలుగువేల గజాల స్థలాన్ని కొనుగోలుచేశారు. కాగా ఆ స్థలంలో కొంత మంది ఆ భూమి తమదని, 40 ఏళ్లుగా నివసిస్తున్నామని ఆర్డీవో, తహసీల్దార్, కమిషనర్లకు ఫిర్యాదుచేశారు. ఇదిలా ఉండగా మునిసిపల్ ఎన్నికల్లో వర్గ విభేదాలతో కొట్టుమిట్టాడిన నాయకుల మధ్య ఆధిపత్యపోరులో మాజీ ఎంపీపీ కొనుగోలు చేసిన స్థలం ఇప్పుడు విబేధాలకు కేం ద్రమైంది. ఇది ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకు నే వారకు వెళ్లింది. దీని వెనుక పార్టీలోని కొంతమంది నాయకుల హస్తం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు.