Share News

పీహెచసీలో 24గంటల వైద్యం అందించాలి

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:24 AM

బీబీనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24గంటల వైద్య సేవలు అందించేందుకు సరిపడా వైద్యులను నియమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు.

 పీహెచసీలో 24గంటల వైద్యం అందించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌

బీబీనగర్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): బీబీనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24గంటల వైద్య సేవలు అందించేందుకు సరిపడా వైద్యులను నియమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. వైద్యాధికారి మౌనికారెడ్డితో మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఆయుర్వేద డిస్పెన్సరీకి మరోచోట పక్కా భవనం నిర్మించి ఇవ్వాలన్నారు. 24గంటల వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఇద్దరు డాక్టర్లలో ఒకరిని డిప్యూటేషనపై ఇతర కేంద్రాలకు పంపడం వల్ల ఇక్కడ ఉన్న ఒక్క డాక్టర్‌పై పనిభారం పడుతోందన్నారు. పీహెచసీకి మూడేళ్లుగా బకాయిపడిన డెవల్‌పమెంట్‌ ఫండ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు చంద్రారెడ్డి, శ్రావణ్‌కుమార్‌, సతీష్‌, యాదమ్మ, శ్రీరాములు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 12:25 AM