Share News

10లో 12వ స్థానం

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:49 AM

పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా 12వ స్థానంతో సరిపెట్టుకుంది.

 10లో 12వ స్థానం

రాష్ట్రస్థాయిలో ఏడో స్థానం నుంచి పడిపోయిన ఫలితాలు

జిల్లాలో 98.30శాతం ఉత్తీర్ణత

ఫలితాల్లో బాలికలదే పైచేయి

బాలురు 97.92 శాతం, బాలికలు 98.65 శాతం ఉత్తీర్ణత

(ఆంధ్రజ్యోతి, యాదాద్రి)

పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా 12వ స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది ఏడో స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది ఐదు స్థానాలు దిగువకు పడిపోయి 12వ స్థానంలో నిలిచింది. మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు జిల్లాలో మొత్తం 8,930 మంది విద్యార్థులకు 50 పరీక్షా కేంద్రాల్లో 8,918 మంది హాజరయ్యారు. వీరిలో 8,766 మంది (98.30శాతం) ఉత్తీర్ణత సాధించారు. 4,325 మంది బాలురు పరీక్షలు రాయగా, 4,235 మంది (97.92శాతం) ఉత్తీర్ణత పొందారు. 4,593 మంది బాలికలు పరీక్షలు రాయగా, 4,531 మంది (98.65శాతం) ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం గత ఏడాది కంటే పెరిగినా, రాష్ట్రస్థాయిలో మాత్రం జిల్లా స్థానం పడిపోయింది. గత ఏడాది 2024-25 విద్యాసంవత్సరంలో 8,622మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 8,432 మంది (97.80శాతం) ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయిలో ఐడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిల్లాలో 8,918 మంది విద్యార్థులకు 8,766 మంది (98.30శాతం) ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్రస్థాయిలో 12వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది కంటే ఉత్తీర్ణత శాతంలో ప్రగతి సాధించినా, రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌లో పడిపోయింది. 2022-23లో 8,973 మంది పరీక్షలు రాయగా, 7,265మంది (80.97 శాతం) ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 23వ స్థానం దక్కింది. 2023-24లో మొత్తం 9,108మంది విద్యార్థులకు 8,237మంది (90.44శాతం) ఉత్తీర్ణులై రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచారు. 2024 -25లో 8,622 మంది విద్యార్థులకు 8,432 మంది (97.80శాతం) ఉత్తీర్ణులై రాష్ట్ర స్థాయిలో ఏడో స్థానంలో నిలిచారు.

192 పాఠశాలల్లో వందశాతం ఫలితాలు

జిల్లాలో వివిధ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 267 ఉన్నత పాఠశాలు ఉండగా, వా టిలో 192 పాఠశాలలు నూటికి నూరుశాతం ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ, మోడల్‌, ఆశ్రమ, గురుకుల, కస్తూర్బా, సాంఘిక సంక్షేమ, బీసీ, ఎస్టీ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలోని పాఠశాలతో పాటు ప్రైవేట్‌ పాఠశాలల్లో జిల్లా వ్యాప్తంగా 98.30శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలు ఆరు ఉండగా, నూటికి నూరు ఫలితా లు సాధించిన వాటిలో ఒకటి, జిల్లా పరిషత 148 పాఠశాలలు ఉండగా, వాటిలో 108 పాఠశాలలు వందశాతం ఫలితాలను సాధించాయి. తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ ఏడు ఉండగా, రెండు పాఠశాలలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 161 డేస్కాలర్‌ ప్రభుత్వ పాఠశాలల్లో 111 వందశాతం ఫలితాలు సాధించాయి. మొత్తం సగటున 97.40 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ పాఠశాలల్లో 4,601మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 4,481 మంది ఉత్తీర్ణత సాధించారు. వీ రిలో 2,367 బాలురకు 2,291మం ది (96.8శాతం), 2,234మంది బా లికలు పరీక్షలు రాయగా, 2,190 మంది (98శాతం) ఉత్తీర్ణత సా ధించారు.

11 కేజీవీబీ, గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో నూరుశాతం

జిల్లాలోని కేజీబీవీ, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ, ఎస్టీ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు సైతం పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. జిల్లాలో 11 కేజీబీవీ, 3 సాంఘిక సంక్షేమ గురుకుల, ఒక ఎస్టీ గురుకుల ఆశ్రమ పాఠశాలలు కలిపి మొత్తం 15 ఉండగా, వీటిలో 11 పాఠశాలలు నూటికి నూరుశాతం ఫలితాలను సాధించాయి. 11 కేజీబీవీల్లో 7, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు మూడుకు మూడు, ఎస్టీ గురుకుల ఆశ్రమ పాఠశాల ఒకటికి ఒకటి వందశాతం ఫలితాలు సాధించాయి. ఈ పాఠశాలల్లో 99శాతం ఫలితాలు వచ్చాయి. మొత్తంగా ఈ మూడు యాజమాన్యాల కింద నడుస్తున్న ఈ పాఠశాలల్లో 701 మంది పదో తరగతి పరీక్షలు రాయగా, 964మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 68మందికి 68 మంది (100శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికల్లో 633 మంది పరీక్షలు రాయగా, 626మంది (98.9శాతం) ఉత్తీర్ణత సాధించారు.

11 రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో..:

జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలు 15 ఉండగా, వాటిల్లో 11 పాఠశాలల్లో నూరుశాతం ఫలితాలు వ చ్చాయి. మహాత్మా జ్యోతిరావుబా పూలే బీసీ గురుకుల, తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 15 ఉండగా, వీటిలో 11 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఫలితాలు సాధించారు. వీటిలో బీసీ గురుకుల పాఠశాలలు 4, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు 2, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 5 వందశాతం ఫలితాలు సాధించాయి. 15 పాఠశాలల్లో 99.6శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఈ పాఠశాలల్లో మొత్తం 952మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 948 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 395 బాలురకు 393 మంది, 557 మంది బాలికలకు 555 మంది ఉత్తీర్ణుత సాధించారు. మొ త్తంగా 15 పాఠశాలల్లో కేవలం నలుగురు మాత్రమే అనుత్తీర్ణులు కావడం విశేషం.

59 ప్రైవేట్‌ పాఠశాలల్లో..

జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ యాజమాన్యాల కింద 76 ఉన్నత పాఠశాలలు కొనసాగుతుండగా, 59 పాఠశాలలు నూరుశాతం సాధించగా, సగటున 99.2శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో మొత్తం 2,664మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,643మంది ఉత్తీర్ణులయ్యారు. కేవలం 21 మంది విద్యార్థులు అనూత్తీర్ణులయ్యారు. 1,495 మంది బాలురకు 1,483 మంది, 1,169 బాలికలకు 1,160మంది ఉత్తీర్ణులయ్యారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలనే లక్ష్యం జిల్లాలో చేరువైం ది. వేలకొద్దీ ఫీజులు చెల్లించి ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న వారితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు పోటీపడి ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లాలో మొత్తం 267 ఉన్నత పాఠశాలలు ఉండగా, వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కింద 191, ప్రైవేట్‌ పాఠశాలలు 59 ఉన్నాయి. 191 ప్రభు త్వ పాఠశాలల్లో 6,254 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 6,123 మంది ఉత్తీర్ణత సాధించారు. 133 పాఠశాలలు నూరుశాతం ఫలితాలు సాధించాయి. సగటు ఫలితాల శాతం 98.2గా నమోదైంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో 2,664 మంది విద్యారు ్థలు పరీక్షలు రాయగా, 2,643 మంది (99.20శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఆర్థికం గా, సా మాజికంగా వెనుకబడిన పేదవర్గాల ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న విద్యా వసతులను వినియోగించుకుని, ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులతో పోటీపడి ఉత్తమ ఫలితాలు సాధించడం విద్యారంగం అభ్యున్నతికి శుభపరిణామంగా భావిస్తున్నారు.

పదో తరగతిలో జిల్లాలో నాలుగేళ్లుగా ఫలితాలు ఇలా..

సంవత్సరం బాలురు ఉత్తీర్ణత శాతం బాలికలు ఉత్తీర్ణత శాతం మొత్తం ఉత్తీర్ణత శాతం స్థానం

2022-23 4,435 3,439 77.54 4,538 3,826 84.31 8,973 7,265 80.97 23వ

2023-24 4,571 4032 80.21 4,537 4,205 92.68 9,108 8,237 90.44 25వ

2024-25 4,215 4,111 97.53 4,407 4,321 98.05 8,622 8,432 97.80 7వ

2025-26 4,325 4,235 97.92 4,593 4,531 98.65 8,930 8,918 98.30 12వ

రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో..

యాజమాన్యం మొత్తం వంద

శాతం

ఎంజేపీటీబీసీ 5 4

టీఎంఆర్‌ఈఐఎస్‌ 3 2

టీఎస్‌డబ్లూఆర్‌ఈఐఎస్‌ 7 5

మొత్తం 15 11

నూరుశాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు

యాజమాన్యం మొత్తం వంద శాతం

ఫలితాలు

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 6 1

జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలు 148 108

తెలంగాణ మోడల్‌ హైస్కూల్స్‌ 7 2

మొత్తం 161 111

Updated Date - Apr 30 , 2026 | 12:49 AM