రైతాంగానికి కొత్త సాంకేతికతలు అందించాలి
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:37 AM
రైతాంగానికి కొత్త సాంకేతికతలను అందించి... వారు అధిక దిగుబడులతో స్థిర ఆదాయం పొందేలా కృషి చేయాలని... ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
అధిక దిగుబడి... స్థిర అదాయం పొందేలా కృషి చెయ్యాలి
శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులకు మంత్రి తుమ్మల సూచన
రాజేంద్రనగర్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రైతాంగానికి కొత్త సాంకేతికతలను అందించి... వారు అధిక దిగుబడులతో స్థిర ఆదాయం పొందేలా కృషి చేయాలని... ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాజేంద్రనగర్‌లోని వర్సిటీలో శుక్రవారం జరిగిన మహాత్మాగాంధీ 157వ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి స్వాతంత్య్ర సమరయోఽధలు, మహనీయుల త్యాగాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఆనాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చేతుల మీదుగా ఏర్పాటైన ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం నేడు దేశంలోనే వ్యవసాయ రంగానికి తలమానికంగా నిలిచిందన్నారు. జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యను మంత్రి అభినందించారు.