Share News

22-A వివాదం.. ప్రజలు ఆందోళన చెందవద్దన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:01 PM

22-A వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. 22-A బూచి పేరు మీద ప్రజలను ఆఫీస్‌ల చుట్టూ తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

22-A వివాదం.. ప్రజలు ఆందోళన చెందవద్దన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
22A Land Issues

ఇంటర్‌నెట్ డెస్క్: 22-A వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. 22-A బూచి పేరు మీద ప్రజలను ఆఫీస్‌ల చుట్టూ తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 22-A జెన్యూన్ కేసుల పరిష్కారం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జెన్యూన్ కేసుల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 18005- 994788కి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..


‘ప్రైవేట్‌ ఆస్తులు 22-A జాబితాలో పెట్టిన అంశం మా దృష్టికి వచ్చింది. మేడ్చల్‌ జిల్లాలో అత్యధికంగా 511 అప్లికేషన్లు, రంగారెడ్డి జిల్లాలో 146 అప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్‌లో 49, సంగారెడ్డిలో 38 అప్లికేషన్లు వచ్చాయి. ప్రైవేటు భూమిని 22-A కింద పెట్టారని 757 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ 22-A జాబితాలోకి ఎందుకు వచ్చాయనే అంశంపై చర్చించాం. ప్రైవేటు ఆస్తుల యజమానులను ఇబ్బందిపెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. గ్రౌండ్‌ రియాలిటీ ఎలా ఉందనే అంశంపై సమీక్షించాం. న్యాయంగా ఉన్నవాటిని త్వరలోనే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం’..


‘ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. కోర్టులకు వెళ్లాల్సిన పనిలేదు. అధికారులకు అప్లికేషన్స్‌ ఇస్తే చాలు. న్యాయబద్ధమైన మీ ఆస్తులకు తొందరగా క్లియరెన్స్‌ అభిస్తుంది. ప్రజలు ఆందోళన చెందవద్దు. కొన్ని ప్రాంతాల్లో అధికారుల తప్పిదాలను గుర్తించాం. కోర్టు ఆదేశాలను ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయకపోవడం వల్లే సమస్య ఏర్పడింది. అధికారుల తప్పిదాలను సవరణ చేస్తున్నాం. నిజమైన కేసులు త్వరలోనే పరిష్కారం అవుతాయి’ అని అన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 05:15 PM