Share News

సనత్‌నగర్‌ టిమ్స్‌లో మెగా డయాలసిస్‌ కేంద్రం

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:15 AM

సనత్‌నగర్‌ టిమ్స్‌ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్)లో మెగా డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.

సనత్‌నగర్‌ టిమ్స్‌లో మెగా డయాలసిస్‌ కేంద్రం

  • మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): సనత్‌నగర్‌ టిమ్స్‌ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్)లో మెగా డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిడ్నీ సంబంధ వైద్య సేవలను మరింతగా అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నామన్న రాజనర్సింహ.. గత రెండేళ్లలో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 18 కేంద్రాలతో కలిపి రాష్ట్రంలో ఏర్పాటైన డయాలసిస్‌ కేంద్రాల సంఖ్య 102కు చేరిందని గురువారం ‘ఎక్స్‌’లో తెలిపారు. భవిష్యత్తులో డయాలసిస్‌ కేంద్రాలను 180కి పెంచడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.

Updated Date - Mar 13 , 2026 | 05:15 AM