Share News

వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. కారును ఆపి చెక్ చేయగా..

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:24 PM

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా అవుతున్న 101.2 కిలోల ఎండు గంజాయితో పాటు 2.7 కిలోల హాషీష్ ఆయిల్‌ను.. ఖమ్మం జిల్లా వైరాలో పోలీసులు పట్టుకున్నారు.

వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. కారును ఆపి చెక్ చేయగా..
Wyra drug seizure (Representative image)

ఖమ్మం జిల్లా వైరాలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా అవుతున్న 101.2 కిలోల ఎండు గంజాయితో పాటు 2.7 కిలోల హాషీష్ ఆయిల్‌ను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ అనుమాస్పదంగా ఉన్న హర్యానా నెంబర్ ప్లేట్ కలిగిన కారును ఆపి చెక్ చేసింది. తనిఖీల్లో గంజాయి, హ్యాషిష్ ఆయిల్ బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన మహమ్మద్ అస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వైరా ఎక్సైజ్ స్టేషన్‌కు నిందితుడిని అప్పగించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల విలువ సుమారు 67.20 లక్షల రూపాయలుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ ఇండియా, పాక్ మ్యాచ్

ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదు: ఏపీ హోంమంత్రి అనిత

Updated Date - Feb 24 , 2026 | 06:33 PM