Share News

పుదుచ్చేరిలో మిడ్జిల్‌ యువకుల మిస్సింగ్‌!

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:41 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా మి డ్జిల్‌కు చెందిన కొందరు యువకులు పుదుచ్చేరిలో గల్లంతయ్యా రంటూ వచ్చిన వార్తలు గ్రామంలో కలకలం సృష్టించాయి.

పుదుచ్చేరిలో మిడ్జిల్‌ యువకుల మిస్సింగ్‌!
పాండిచ్చేరి బీచ్‌లో యువకులు తీసుకున్న సెల్పీ

- సముద్రంలో గల్లంతయ్యారని చానళ్లలో వార్తలు

- ఆందోళనకు గురై ఫోన్‌ చేసిన కుటుంబ సభ్యులు

- తాము క్షేమంగా ఉన్నామని తెలిపిన యువకులు

మిడ్జిల్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జిల్లా మి డ్జిల్‌కు చెందిన కొందరు యువకులు పుదుచ్చేరిలో గల్లంతయ్యా రంటూ వచ్చిన వార్తలు గ్రామంలో కలకలం సృష్టించాయి. వారంతా క్షే మంగా ఉన్నట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చు కున్నారు. మండల కేంద్రానికి చెందిన వినాయక ఉత్సవ కమిటీ స భ్యులు రాకేశ్‌, లోకేశ్‌, జావీద్‌, శివ, సుశాంత్‌, యశోధర్‌, సాకేత్‌ ఈ నె ల 24న మంగళవారం రైలులో తిరుపతికి వెళ్లారు. అక్కడ శ్రీవారి దర్శ నం అనంతరం అరుణాచలా నికి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. అ క్కడి నుంచి విహారం కోసం పుదుచ్చేరికి వెళ్లారు. వారిలో ముగ్గురు యువకులు అక్కడి బీచ్‌లో అలల తాకిడికి కొట్టుకుపోయినట్లు ఆదివా రం తెల్లవారుజామున కొన్ని టీవీ ఛానల్స్‌లో, ఆన్‌లైన్‌ న్యూస్‌ పేప ర్లలో వార్తలు ప్రసారం అయ్యాయి. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దీంతో గ్రామంలో కలకలం చెలరేగింది. వారి కుటుంబ స భ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురై యువకులకు ఫోన్‌చేసి ఆ రా తీయగా, వారంతా క్షేమంగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ఈ విష యంపై బృందంలోని బాస రాకేశ్‌ స్పందిస్తూ.. తాము బీచ్‌కు వెళ్లిన స మయంలోనే అక్కడికి వచ్చిన మరో యువకుడు ప్రమాదవశాత్తు నీటి లోపలికి వెళ్లడం గమనించి, తామే అప్రమత్తమయ్యామని తెలిపారు. రెస్య్కూ టీంతో కలిసి అతడిని కాపాడి బయటకు తీసుకొచ్చామని తెలిపారు. తామంతా క్షేమంగా ఉన్నామని, ప్రస్తుతం తిరుగు ప్రయా ణమయ్యామని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Nov 29 , 2026 | 11:41 PM