Share News

యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:06 PM

సొంతంగా ఉపాధి పొం దేందుకు బార్బర్‌ దుకాణం నెలకొల్పేందుకు ఆన్‌లైన్‌ యాప్‌ల లో రుణం తీసుకోగా, తీసుకున్న రుణం చెల్లించాలని నిర్వాహకు లు వేధించడంతో తరుణ్‌కుమార్‌ (28) అనే యువకుడు ఆ త్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో శనివారం చోటుచేసుకున్నది.

 యువకుడి ఆత్మహత్య

- ఆన్‌లైన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులే కారణం

జడ్చర్ల, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి) : సొంతంగా ఉపాధి పొం దేందుకు బార్బర్‌ దుకాణం నెలకొల్పేందుకు ఆన్‌లైన్‌ యాప్‌ల లో రుణం తీసుకోగా, తీసుకున్న రుణం చెల్లించాలని నిర్వాహకు లు వేధించడంతో తరుణ్‌కుమార్‌ (28) అనే యువకుడు ఆ త్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో శనివారం చోటుచేసుకున్నది. జడ్చర్ల సీఐ కమలాకర్‌ తెలిపిన వివరాల మేరకు... నసరుల్లాబాద్‌ గ్రామానికి చెందిన తరుణ్‌కుమార్‌ జడ్చర్లలోని కల్వకుర్తికి వెళ్లే రోడ్డులో బార్బర్‌ దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు ఫైస్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సంస్థలో రూ. 10 లక్షలు, భారత్‌పే యాప్‌ ద్వారా రూ. 5 లక్షలు, మరికొన్ని యాప్‌లలో మరికొంత నగదు ను అప్పుగా తీసుకున్నాడు. దుకాణం సరిగా నడవకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక మదనపడుతుండేవాడు. తీసుకున్న రుణం చెల్లించాలంటూ రుణం ఇచ్చిన ఫైనాన్స్‌, యాప్‌ ల నిర్వాహకులు వేధింపులకు పాల్పడ్డారు. ఎప్పటిలాగే నసరుల్లాబాద్‌ నుంచి శుక్రవారం ఉదయం బార్బర్‌ దుకాణానికి తరుణ్‌కుమార్‌ వచ్చాడు. తిరిగి సాయం త్రం గ్రామానికి వెళ్లలేదు. శుక్రవారం రాత్రి బార్బర్‌ దు కాణంలో పరదాబట్టతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం మధ్యాహ్నం వరకు దుకాణం తెరువకపోవడంతో స్థానికుల సమాచారంతో అనుమా నం కలిగి తల్లిదండ్రులు వచ్చి దుకాణం తెరిచి చూడగా సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే జడ్చర్ల ఏరి యా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధా రించారు. ఫైనాన్స్‌ సంస్థ, యాప్‌ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేకే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ మృతుడి తండ్రి ఆం జనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ వివరించారు.

Updated Date - Apr 11 , 2026 | 11:06 PM