అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:26 PM
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల రహదారిలో బాలయ్య గుట్ట వద్ద శుక్రవారం అనుమానాస్పద స్థితిలో యువకు డు మృతి చెందాడు.
- మృతుడి జేబులో ఉన్న చిటీలో కొంతమంది పేర్లు, భార్యాభర్తల ఫొటోలు
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కొల్లాపూర్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల రహదారిలో బాలయ్య గుట్ట వద్ద శుక్రవారం అనుమానాస్పద స్థితిలో యువకు డు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవా రం చోటు చేసుకుంది. కొల్లాపూర్ ఎస్‌ఐ సురే ష్ కథనం మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లాపూర్ మండల పరిధిలోని మాధవరావుపేట గ్రామానికి చెందిన మాందాపురం నాగరాజు (25) సోమశిల రహదారిలో ఉన్న బాలయ్య గుట్ట వద్ద వేప చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని చనిపోయినట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. నాగరాజు తల్లి శేషమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహా న్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్ప జెప్పినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెల్లడించారు. ఇదిలా ఉండగా మృతి చెందిన నాగరాజు జేబులో రామాపురం గ్రామాని కి చెందిన కొంతమంది పేర్లు రాసి ఉన్నాయని సమాచారం కుటుంబ సభ్యుల కు అందడంతో నాగరాజు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేయాలని పోలీసులకు తల్లి శేషమ్మ లి ఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. గడిచిన మంగళవారం రోజు నాగరాజు భార్య మౌనిక అనారోగ్యంతో మృతి చెందిందని, నాగరాజు కుటుంబ సభ్యులు చెప్తుండగా మౌనిక మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని మౌనిక కుటుం బ సభ్యులు నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో నాగరాజు మానసికంగా వేధించిన రామాపురం గ్రామానికి చెందిన వ్యక్తుల పేర్లను రాసి తన జేబులో పెట్టుకుని ఉరి వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నా రు. కేసును నిష్ఫక్షపాతంగా విచారించి నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని రామాపురం గ్రామస్థులు కోరుతున్నారు. అదే విధంగా మృతుని ప్యాంట్ జేబులో భార్యాభర్తలు కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి.