Share News

మీ విజయాలు విద్యార్థులందరికీ ఆదర్శం

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:08 PM

రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ప్రత్యేక అవసరాల విద్యార్థులను కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అభినందించారు.

మీ విజయాలు విద్యార్థులందరికీ ఆదర్శం
ప్రత్యేక అవసరాల పిల్లలను అభినందిస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • క్రీడాపోటీల్లో జిల్లాకు పతకాలు సాధించిన ప్రత్యేక అవసరాల విద్యార్థులు

  • ప్రత్యేకంగా అభినందించిన కలెక్టర్‌ సంతోష్‌

గద్వాల, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ప్రత్యేక అవసరాల విద్యార్థులను కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అభినందించారు. బుధవారం తన చాంబర్‌లో కలిసిన విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో జిల్లా విద్యార్థులు పతకాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ దోమల్‌గూడలో ఈనెల 17న సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లలకు క్రీడాపోటీలను నిర్వహించారు. జిల్లాకు చెందిన విష్ణు లాంగ్‌ జంప్‌లో మొదటి స్థానం, షాట్‌పుట్‌లో రెండవ స్థానం సాధించి విశేష ప్రతిభ కనబరిచారు. క్యారమ్స్‌, షాట్‌పుట్‌లో నిఖిత రెండవ స్థానం సాధించింది. వినయ్‌ కుమార్‌, విజయేంద్ర రన్నింగ్‌ విభాగంలో రెండవ స్థానం సాధించి జిల్లాకు మంచి పేరు తెచ్చా రు. విద్యార్థులు తమ శారీరక పరిమితులను అధిగమిస్తూ ధైర్యంగా పో టీలో పాల్గొనడం అభినందనీయం అని కలెక్టర్‌ కొనియాడారు. ఈ విజయా లు ప్రతీ ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాయని అభినందించారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని అన్నారు. ఇటువంటివి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని తెలిపారు. క్రీడల్లో రాణించడానికి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించ. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి, సెక్టోరియల్‌ అధికారులు కర్రెప్ప, మైఖేల్‌, శ్రీనివాసులు, శిక్షకులు, తల్లిదండ్రులు ఉన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 11:08 PM