Share News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:24 PM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మోజులో తీవ్ర అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొం డ మండలం వింజమూరు గ్రామంలో చో టు చేసుకొంది.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి
మాల కృష్ణయ్య (ఫైల్‌)

- పొలం అమ్మినా తీరని అప్పులు

కోయిలకొండ, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మోజులో తీవ్ర అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొం డ మండలం వింజమూరు గ్రామంలో చో టు చేసుకొంది. గ్రామస్థులు తెలిపిన వివ రాల ప్రకారం.. వింజమూరుకు చెందిన మాల హన్మన్నకు ఇద్దరు కూమారులు. అందులో చిన్న కుమారుడు మాల కృష్ణయ్య (30) జిల్లా కేంద్రంలో ఆ టో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ బె ట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. ఇందులో రూ.లక్షల్లో నష్టపోయాడు. తం డ్రితో అప్పులు అయ్యాయని డబ్బులు కావాలని ఒత్తిడి చేయడంతో తండ్రి రూ.7.50లక్షలు భూమి అమ్మి ఇద్దరు కూమారులకు అందిం చాడు. కొన్ని రోజులకు తండ్రి హన్మన్న మృతి చెందాడు. కృష్ణయ్యలో మార్పురాక బెట్టింగ్‌లకు పాల్పడుతూ మరింత అప్పులు చేశాడు. దీని పై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మందలించారు. గ్రామంలో ఉన్న మరింత భూమిని రూ.23లక్షలు, రూ.8లక్షలకు రెండు సార్లు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల కోసం విక్రయించాడు. భూములు అమ్మిన దాదాపు రూ.32 లక్షల పైగా డబ్బులు వచ్చినా అప్పు తీరకపోవడంతో మరింత భూమి ని అమ్మడానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. గ్రా మంలో భూమి కొనడానికి ఎవరూ రాకపోవడంతో కృష్ణయ్య మన స్థాపం చెంది ఆదివారం పురుగుల మందు తాగాడు. అతన్ని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించగా బుధవారం మృతి చెందాడు. కృష్ణ య్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై ఎలాంటి కే సు నమోదు కాలేదు. కాగా ఈయన అంతక్రియల కోసం సర్పం చ్‌తోపాటు నాయకులు, స్నేహితులు ఆర్థికసాయం అందించారు.

Updated Date - Jul 16 , 2026 | 11:24 PM