రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:09 PM
మహ బూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని స్థాని క జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది.
రాజాపూర్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మహ బూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని స్థాని క జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ రా జశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరి ధిలోని చెన్నవెళ్లి గ్రామనికి చెందిన నరేష్ (35) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని ఓ పరిశ్ర మల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు వెళ్తున్న విధంగా గురువారం ఉదయం తన స్వంత ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్తున్న సమయంలో మండల కేంద్రంలోని శివారులో తను వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక జడ్చర్ల నుంచి షాద్‌నగర్ వైపు వెళ్తున్న ఓ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కు మారుడు ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చ ర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.