Share News

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:35 PM

జోగుళాంబ గద్వాల జిల్లా, కేటీదొడ్డి మండల కేంద్రంలో ఓ యువ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

కేటీదొడ్డి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లా, కేటీదొడ్డి మండల కేంద్రంలో ఓ యువ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కేటీదొడ్డి గ్రామానికి చెందిన పిల్లి వీరన్న (28) బుధవారం రాత్రి రెండు గంటల సమయంలో పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. మోటార్‌ ఆన్‌ కాకపోవడంతో దగ్గరలోని ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గరకు వెళ్లాడు. అక్కడ విద్యుత్‌ తీగలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘట నా స్థలానికి చేరుకున్నాడు. పిల్లి వీరన్నకు భార్య, మూడేళ్ల కుమార్తె ఉ న్నారు. ప్రస్తుతం భార్య నిండు గర్భిణి కావడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది. సంఘటనపై మృతుడి తండ్రి పిల్లి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - Oct 22 , 2026 | 11:35 PM