రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:10 PM
మండలంలోని షాపూర్ స్టేజీ సమీపంలో మూల మలుపు వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో సోలీపూర్ గ్రామానికి చెందిన పెద్ద ముక్కుల తరుణ్(23)మృతి చెందాడు.
ఖిల్లాగణపురం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని షాపూర్ స్టేజీ సమీపంలో మూల మలుపు వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో సోలీపూర్ గ్రామానికి చెందిన పెద్ద ముక్కుల తరుణ్(23)మృతి చెందాడు. మృతుడి భార్య పెద్దముక్కుల గీతాంజలి బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. మృతుడి భార్య గీతాంజలి తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం మృతుడు తరుణ్ సోలీపూర్ నుంచి ఖిల్లాగణపురంకు బైక్‌పై వచ్చి తిరుగు ప్రయాణంలో షాపూర్ శివారు ప్రాంతం మూల మలుపు వద్ద వేగంగా రావడంతో బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. తలకు, ముఖానికి తీవ్ర రక్త గాయాలై మృతి చెందినట్లు వివరించారు.
నేత్రదానం...
కాగా, మృతి చెందిన తరుణ్ కళ్లను బుధవారం ఎల్‌వీ ప్రసాద్ హైదరా బాద్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు దానం చేశారు. తన కుమారుడు చిన్న వయస్సులో మృతి చెందినా ఇతరులకు కంటి చూపు అందించి వారికి వెలుగును అందించడానికి నేత్రదానం చేసినట్లు మృతుడి తండ్రి బాలరాజు తెలిపారు.