Share News

రాష్ట్రస్థాయిలో యువ అథ్లెట్లు సత్తాచాటాలి

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:23 PM

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీ ర్చిదిద్దడమే జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ లక్ష్య మని ప్రధాన కార్యదర్శి సోలపోగుల సాములు అన్నారు.

రాష్ట్రస్థాయిలో యువ అథ్లెట్లు సత్తాచాటాలి
క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేస్తున్న స్వాములు

- జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి స్వాములు

కల్వకుర్తి, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీ ర్చిదిద్దడమే జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ లక్ష్య మని ప్రధాన కార్యదర్శి సోలపోగుల సాములు అన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నె హ్రూ స్టేడియంలో నిర్వహించనున్న 12వ రాష్ట్ర యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కు జిల్లా జ ట్టుల ఎంపిక కోసం ఆదివారం కల్వకుర్తి పట్ట ణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మై దానంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. పో టీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో సాధన చే స్తే రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు నాగర్‌కర్నూ ల్‌ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరా రు. అనంతరం జిల్లా స్థాయి ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ప్రశంసాప త్రాలు, బహుమతులు అందజేశారు. కార్యక్ర మంలో అంజయ్య, ఫిజికల్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌, నిరంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.

తిమ్మాజిపేట: జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపి కలో మండల కేంద్రానికి చెందిన మీదింటి నో హ, మీదింటి అంకిత్‌రోనవ్‌ పాల్గొని తమ ప్ర తిభ కనబర్చి ఒకరు గోల్డ్‌ మెడల్‌ మరొకరు సిల్వర్‌ మెడల్‌ సాధించారు.

Updated Date - Jul 26 , 2026 | 11:23 PM