నల్లమల ఒడిలో యోగా సాధకుల ట్రెక్కింగ్
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:22 PM
కొ ల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల గ్రామ రహదారిలో ఉన్న ఎకో పార్కు ప్రకృతి సౌంద ర్యాన్ని ఆస్వాదిస్తూ, శారీరక దృఢత్వం కోసం శనివారం ఉదయం ప్రముఖ యోగా మాస్టర్ పతంజలి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో యోగా సాధకులు భారీ ట్రెక్కింగ్ నిర్వహించారు.
- సోమశిల ఎకో పార్కు వద్ద ప్రకృతి అందాలతో పరవశం
కొల్లాపూర్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కొ ల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల గ్రామ రహదారిలో ఉన్న ఎకో పార్కు ప్రకృతి సౌంద ర్యాన్ని ఆస్వాదిస్తూ, శారీరక దృఢత్వం కోసం శనివారం ఉదయం ప్రముఖ యోగా మాస్టర్ పతంజలి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో యోగా సాధకులు భారీ ట్రెక్కింగ్ నిర్వహించారు. సుమారు 58 మంది యోగా సాధకులు ఉ త్సాహంగా పాల్గొన్నారు. ఉదయాన్నే నాగర్‌క ర్నూల్ జిల్లా సోమశిల ఎకో పార్కు వద్దకు చేరుకున్న యోగా సాధకులు, అక్కడి నుంచి కొండ ప్రాంతాలలో సుమారు 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ నిర్వహించారు. దట్టమైన అ టవీ ప్రాంతం గుండా సాగిన ఈ ప్రయాణం లో సాధకులు ప్రకృతి ఒడిలో నూతనో త్తేజాన్ని పొందారు. అ నంతరం ఎకో పార్కులో ని ఎత్తైన వాచ్ టవర్‌పై కి చేరుకుని, అక్కడి నుం చి కనువిందు చేసే నల మల్ల అందాలను, దూ రంగా కనువిందు చేసే కృష్ణానదిని తిలకించి ముగ్ధులయ్యారు. ఈ సం దర్భంగా ట్రెక్కింగ్ ప్రా ముఖ్యతను యోగా మా స్టర్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ... మనిషి ఆరో గ్యానికి యోగాతో పాటు ప్రకృతి ఒడిలో గడిపే సమయం ఎంతో కీలకమని పేర్కొన్నా రు. శారీరక దృఢత్వం ట్రెక్కింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా కండరా లు బలోపేతం అవుతాయన్నారు. ఈ ట్రెక్కిం గ్‌లో పాల్గొన్న సాధకులు వాచ్ టవర్ వద్ద బృందాలుగా ఫోటోలు దిగి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రకృతి ఒడిలో గడిపిన ఈ 45 నిమిషాలు తమకు ఎంతో శక్తిని ఇచ్చా యని యోగా సాధకులు హర్షం వ్యక్తం చేశా రు. తమకు సహకరించిన అటవీ శాఖ అధికా రి వాణి కుమారి అటవీ సిబ్బంది నవీన్, శివ ప్రసాద్‌లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.