Share News

యోగ, బ్రహ్మ, జ్ఞాన విద్యలను పాఠ్యాంశంగా చేర్చాలి

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:10 PM

యోగవిద్య, బ్రహ్మవిద్య, జ్ఞానవిద్యలను కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశంగా చేర్చాలంటూ బ్రహ్మజ్ఞాన యోగా విద్యాసంకల్ప సమాలోచన వేదిక జాతీయ ఆధ్వర్యంలో తీర్మాణం చేశారు.

యోగ, బ్రహ్మ, జ్ఞాన విద్యలను పాఠ్యాంశంగా చేర్చాలి
ఏకగ్రీవ తీర్మానం చేస్తున్న స్వాములు

- రౌండ్‌టేబుల్‌ సమావేశంలో యోగులు, వీహెచ్‌పీ నాయకులు

జడ్చర్ల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : యోగవిద్య, బ్రహ్మవిద్య, జ్ఞానవిద్యలను కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశంగా చేర్చాలంటూ బ్రహ్మజ్ఞాన యోగా విద్యాసంకల్ప సమాలోచన వేదిక జాతీయ ఆధ్వర్యంలో తీర్మాణం చేశారు. పట్టణంలోని సత్యనారాయణస్వామి ఆలయంలోని హల్‌లో ఆదివారం రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని స్వామి జ్ఞానానందగిరి మహరాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠ్యాంశంలో 20 మార్కుల సబ్జెక్ట్‌గా పెట్టాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. శారీరక, మానసిక, రుగ్మతలను యోగాతో జయించవచ్చన్నారు. బ్రహ్మవిద్యతో విజ్ఞానం, జ్ఞానవిద్యతో ఒత్తిడిని అధిగమించడంతో మనిషి పరిపూర్ణ స్థితికి చేరుకుంటారని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న స్వాములు వెల్లడించారు. 50 బ్రాహ్మజ్ఞాన యోగా శంఖారావ సభలు నిర్వహించడమే లక్ష్యంగా జ్ఞానానంద స్వామి ముందుకు సాగుతున్నారంటూ పేర్కొన్నారు. పరమాత్మానందస్వామి, శంకరానందస్వామి, వెంకటచరణ్‌స్వామి, ఆచారి కృష్ణానందస్వామి, కృపానందస్వామి, గోదాదేవిమాతాజీ, వీహెచ్‌పీ నాయకులు జగ్‌పాల్‌రెడ్డి, మంచన గుండేరావు, ముచ్చర్ల శ్రీకాంత్‌, మాతృశక్తి లావణ్య, కుంచకూరి బుచ్చిలింగం, నాగరాజు, మహేశ్వర్‌, రాధాకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 11:10 PM