Share News

ముగిసిన యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:23 PM

పట్ట ణంలోని ఆర్యసమాజం ఆధ్వర్యంలో మూడు రో జులుగా నిర్వహిస్తున్న త్రిదవసీయ శ్రావణి యజుర్వేద గాయత్రీ మహాయజ్ఞం ఆదివారం పూర్ణాహుతితో ముగించారు.

ముగిసిన యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం
పూర్ణాహుతిలో పాల్గొన్న భక్తులు

జడ్చర్ల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : పట్ట ణంలోని ఆర్యసమాజం ఆధ్వర్యంలో మూడు రో జులుగా నిర్వహిస్తున్న త్రిదవసీయ శ్రావణి యజుర్వేద గాయత్రీ మహాయజ్ఞం ఆదివారం పూర్ణాహుతితో ముగించారు. వేదవిధ్వాంసులు వేదిసింధు యజ్ఞబ్రహ్మ ఆధ్వర్యంలో మూడు రో జుల పాటు ఘనంగా నిర్వహిం చారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యప్రతినిధి సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాదిమి శివకుమా ర్‌ మాట్లాడుతూ.. యజ్ఞాలతో వా తావరణ కాలుష్యం నివారించబ డుతుందన్నారు. వర్షేష్టియజ్ఞంతో సమృద్ధిగా వర్షాలు పడుతాయని, పర్యావరణం శుద్ధీకరణ చేయబ డుతుందన్నారు. వేదాలతో దైవ భక్తి, దేశభక్తి, మంచి నడవడిక క లుగుందన్నారు. కార్యక్రమంలో మచ్చసుధాకర్‌, రాములు, జయశంకర్‌, నరేందర్‌జీ, రఘోత్తమా చారి, నరసయ్య, లక్ష్మణ్‌, గుబ్బ నరసింహులు, బక్కరాజేశ్వర్‌, బోడ్ల విజయ్‌కుమార్‌, కృష్ణయ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:23 PM