Share News

యాదవులు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:47 PM

యాదవులు విద్యా, ఉపాధి, ఆర్థిక, సామా జిక, రాజకీయ రంగాల్లో తమ దైనశైలీలో రాణించాలని గొర్రె లు, మేకల కాపరులదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్‌ పేర్కొన్నా రు.

యాదవులు అన్ని రంగాల్లో రాణించాలి
శ్రీకృష్ణయాదవ కమిటీ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌ను అభినందిస్తున్న యాదవ కమిటీ నాయకులు

మూసాపేట, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : యాదవులు విద్యా, ఉపాధి, ఆర్థిక, సామా జిక, రాజకీయ రంగాల్లో తమ దైనశైలీలో రాణించాలని గొర్రె లు, మేకల కాపరులదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్‌ పేర్కొన్నా రు. గురువారం అడ్డాకుల మండల కేంద్రంలో శ్రీకృష్ణ యాదవ సంఘం మండల కమిటీ అఽధ్యక్షుడు భీమన్నయాదవ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పా ర్టీలకతీతంగా యాదవులంతా కలిసిమెలిసి ఐక్య మత్యం, సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జనాభా ప్రతిపాదికన యాద వులు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సా గాలని, ప్రభుత్వం, రాజకీయ పార్టీల నాయకు లు యాదవులకు పదవుల్లో ప్రాధాన్యం కల్పిం చాలని, నిరాక్షరాస్యులైన వారికి అక్షరాస్యతను కల్పించి చైతన్యవంతులను చేయాలన్నారు. ప్ర భుత్వం ఇచ్చిన హమీ మేరకు ప్రతీ యాదవ కుటుంబానికి గొర్రెల యూనిట్లను వెంటనే మంజూరు చేయాలన్నారు. కాలనుగుణంగా సంక్రమించే వ్యాధులకు కావల్సిన మందులను సకాలంలో సరఫరా చేయాలని, కాపరులకు బీమాతో పాటు 50 ఏళ్లు దాటిన కాపరులకు పెన్షన్‌ను వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. మండల యువత అధ్యక్షుడు శ్రీధర్‌యాదవ్‌, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు వెంకటన ర్సయ్య యాదవ్‌, లక్ష్మినర్సింహా యాదవ్‌, రా చాల తిరుపతయ్యయాదవ్‌, జుర్రు నారాయణ, మద్దె తిరుపతయ్యయాదవ్‌, మహేష్‌యాదవ్‌, మన్నెంకొండ యాదవ్‌, చంద్రశేఖర్‌, జగదీష్‌ యాదవ్‌, రవికుమార్‌యాదవ్‌, బాలరాజు, కృష్ణ య్య, వెంకటయాదవ్‌, కనకయ్య, కురుమూర్తి, నిరంజన్‌, సత్తియాదవ్‌, చెన్నయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:47 PM