కార్మికులను వేధిస్తున్నారు
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:38 PM
సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభు త్వం వేధింపులకు గురిచేస్తున్నదని బీఆర్ ఎస్ మాజీ మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, సి.లక్ష్మారెడ్డి అన్నారు.
- వాళ్లకు టెంట్లు, నీళ్లు ఇవ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు..
- కాళేశ్వరం రైతులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి
- విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభు త్వం వేధింపులకు గురిచేస్తున్నదని బీఆర్ ఎస్ మాజీ మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, సి.లక్ష్మారెడ్డి అన్నారు. పోలీసుల చేత వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా చేస్తూ ఇబ్బందులకు గురిచే స్తుందని విమర్శించారు. తాండూర్‌లో కా ర్మికులకు టెంట్‌లు సప్లై చేయవద్దని పోలీ సులు సప్లయింగ్ కంపెనీకి నోటీసులు ఇ చ్చారని, ఈ విషయం తెలిసి నర్సంపేట లో ఆర్టీసీ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసు కుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడ న్నారు. ఆ కార్మికుడికి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వ హించాలని, వెంటనే కార్పోరేట్ వైద్యం అందించాలని, ఆ కు టుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం మ హబూబ్‌నగర్‌లోని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్యాంపు కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వా రు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చి న హామీలు అమలుచేయాలని, వెంటనే మహాలక్ష్మి బకాయి లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అభినందనీయమని, సహజ న్యాయసూత్రాలకు విరు ద్ధంగా విచారణ చేసినట్లు హైకోర్టు పేర్కొందని, రెండు న్నరేళ్లు కమిషన్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. బీఆర్‌ఎస్‌ను బద్‌నాం చేయాలన్న కుట్రతో కా ళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తూ కుంగిన పిల్లర్లకు మర మ్మతులు చేయకుండా రైతులకు అన్యాయం చేశారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాల న్నారు. కాళేశ్వరం పిల్లర్లు కుంగలేదని, డైనమెట్ పెట్టి పేల్చి వేసి తమ పార్టీని బదనాం చేయాలన్న కుట్ర చేశారన్నా రు. మాజీఎమ్మెల్యే ఆలవెంకటేశ్వరెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమా ర్‌లు మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీఎంఆర్ బీఆర్‌ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.