Share News

బాధ్యతతో పని చేసి అభివృద్ధికి కృషి

ABN , Publish Date - May 14 , 2026 | 11:23 PM

‘ప్రభుత్వం నాపై నమ్మకం ఉంచి గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య సమాఖ్య చైర్‌పర్సన్‌గా నియమించింది.

బాధ్యతతో పని చేసి అభివృద్ధికి కృషి
బాధ్యతలు స్వీకరించిన చైర్‌పర్సన్‌ సరితను అభినందిస్తున్న దృశ్యం

ప్రమాణ స్వీకారోత్సవంలో చైర్‌పర్సన్‌ సరిత

- సత్కరించిన మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి

గద్వాల, మే 14 (ఆంధ్రజ్యోతి) : ‘ప్రభుత్వం నాపై నమ్మకం ఉంచి గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య సమాఖ్య చైర్‌పర్సన్‌గా నియమించింది. సంస్థ అభివృద్ధికి పని చేస్తూనే అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తాను’ అని సరిత అన్నారు. హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌ కార్యాలయం ఆవరణలో గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఆమె వెంటనే బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చి ప్రభుత్వానికి మంచి పేరుతెస్తానన్నారు. రాష్ట్రంలో గొర్రెలు, మేకల అభివృద్ధితో పాటు, వృత్తిదారులకు న్యాయం చేస్తానని తెలిపారు. అన్ని జిల్లాల అధికారుల సహకారంతో సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరిలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలు నవీన్‌యాదవ్‌, వంశీకృష్ణ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌తో పాటు వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు అభినందించారు. కార్యక్రమానికి గద్వాల నియోజకవర్గం నుంచి అధికసంఖ్యలో నాయకులు తరలివెళ్లారు.

Updated Date - May 14 , 2026 | 11:23 PM