Share News

పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల పనులు ప్రారంభించాలి

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:57 PM

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని పెండింగ్‌ ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించాలని అలంపూర్‌ నియోజకవర్గం జేఏసీ చైర్మన్‌ రాంమోహన్‌ కోరారు.

పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల పనులు ప్రారంభించాలి

  • అలంపూర్‌ నియోజకవర్గం జేఏసీ చైర్మన్‌ రాంమోహన్‌

అయిజ టౌన్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని పెండింగ్‌ ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించాలని అలంపూర్‌ నియోజకవర్గం జేఏసీ చైర్మన్‌ రాంమోహన్‌ కోరారు. గురువారం మేడికొండ రోడ్డులో పండగ సాయన్న స్ఫూర్తితో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాల వివక్ష వల్ల దశాబ్దాలుగా సాగునీటి వసతుల కల్పన లో తీవ్రఅన్యాయం చేస్తున్నారన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో రైతాంగానికి అన్యాయం జరుగుతుందన్నారు. ఆర్‌డీఎస్‌, నెట్టెంపాడు, జూరాల, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ లిప్టు పథకాలను వెంటనే పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గోపాల్‌రెడ్డి, హనుమంతు, విజయకుమార్‌, విజయభాస్కర్‌, ఎం.బాష, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:57 PM