ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ వహించాలి
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:40 PM
మహి ళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గై నకాలజిస్టు శ్వేత, లియో నైన్ సంస్థ వ్యవ స్థాపకుడు సుభాష్ నాయక్ అన్నారు.
- ప్రముఖ గైనకాలజిస్టు శ్వేత
మద్దూర్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : మహి ళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గై నకాలజిస్టు శ్వేత, లియో నైన్ సంస్థ వ్యవ స్థాపకుడు సుభాష్ నాయక్ అన్నారు. మునిసి పాలిటీ పరిధిలోని సాపన్‌చెరువు, చింతల్‌దిన్నె తండాల్లో సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గైనకాలజిస్టు మహిళలకు ఉచితంగా వైద్య ప రీక్షలు నిర్వహించారు. నిరుపేద గిరిజన మహి ళలకు సంస్థ ఆధ్వర్యంలో సాపన్‌చెరువు, చింత ల్‌దిన్నె తండాల్లో అవసరమైన శానిటేషన్ నాప్ కిన్లు ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడిం చారు. అదేవిధంగా ప్రపంచ ఆదివాసం దినోత్స వం సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీత, రమేష్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.