మహిళా, ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి లక్ష్యం
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:32 PM
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ మే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు.
- అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క
అయిజ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ మే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయి జలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేశారు. అయిజ నుంచి చిన్నతాండ్రపాడు వరకు రూ. 3.56 కోట్లతో రహదారి, వేణిసోమ్ పూర్ నుంచి చిన్నతాండ్రపాడు రహదారి నిర్మాణానికి రూ.2.50 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ నిధులు పీడబ్ల్యుడీ కింద మంజూరయ్యాయ న్నారు. అక్కడి నుంచి చిన్నతాండ్రపాడు గ్రామం చేరుకున్నారు. అక్కడ స్వాతంత్య్ర సమరయేధులు కరణం సీతారామారావు, కరణం సుబ్బారావు, పెద్ద సుంకన్నగౌడ్‌లకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మా జీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తండ్రి, సామాజికవేత్త ఆనందరావు విగ్రహా న్ని ఆవిష్కరించారు. బస్ షెల్టర్, ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి సీఎం నిధు లు కేటాయిస్తున్నారని తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ స మాజంలో మనకంటూ గుర్తింపు రావాలంటే నిస్వార్థంగా అట్టడుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోరి పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ వాల్మీకి బోయ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తమవంతు కృషి చేస్తానన్నారు. అయిజలోని ఫంక్ష న్‌హాలు నందు మహిళా సంఘ సభ్యులచే నిర్వహించిన కార్యక్రమానికి సీతక్క హాజరయ్యారు. కలెక్టర్ రిజ్వాన్ బాష షేక్ మాట్లాడారు. పెన్షన్ మంజూరు పత్రాలు, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అలంపూర్ ఎ మ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మునిసిపల్ చైర్మన్ సీఎం.సురేష్, గట్టు తిమ్మప్ప, సరిత, అదనపు కలెక్టర్ మధుమోహన్, కృష్ణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌చార్జి సీఈఓ నాగేంద్రం, ప్రజాప్రతినిధులు లక్ష్మికాంతరావు, ప్రకాష్‌గౌడు, దొడ్డప్ప, షెక్షావలి ఆచారి, రాముడు పాల్గొ న్నారు. కాగా, నియోజకవర్గంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే విజయుడు, అయిజ అభివృద్ధికి, ప్రజలకు కావాల్సిన అవసరాలకు సంబంధించి మునిసిపల్ చైర్మన్ సీఎం.సురేష్ మంత్రి సీతక్కకు వినతి పత్రాలు అందచేశారు.