Share News

మునిసిపల్‌ పోరులో మహిళలు

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:18 PM

మునిసిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో కౌన్సిలర్లుగా పోటీకి ప్రధాన పార్టీ అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు.

మునిసిపల్‌ పోరులో మహిళలు

  • అన్ని పార్టీల్లో ఇద్దరి కన్నా ఎక్కువ మంది పోటీ

  • కౌన్సిలర్‌గా గెలుపు కోసం వ్యూహరచనల్లో నిమగ్నం

గద్వాల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో కౌన్సిలర్లుగా పోటీకి ప్రధాన పార్టీ అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు. అయితే మునిసిపాలిటీ చైర్మన్‌లకు కూడా ప్రభుత్వం శనివార మే రిజర్వేషన్లు ప్రకటించడంతో చైర్మన్‌ అను కూలించిన వారు చైర్మన్‌ పదవి పొందేందుకు కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గద్వాల మునిసిపాలిటీ చైర్మన్‌ జనరల్‌ మ హిళకు కేటాయించడంతో మరోసారి మహిళలు తమ అదృష్టాన్ని ప్రదర్శించుకోవడానికి పోటీకి సై అంటున్నారు. ఇందులో ప్రధానంగా గతంలో చైర్‌పర్సన్‌గా చేసిన వారితో పాటు కౌన్సిలర్లుగా పనిచేసిన వారు కూడా చైర్‌పర్స న్‌ పదవి కోసం పోటీకి సై అంటున్నారు. ప్ర ధానంగా అధికార పార్టీలో మాజీ కౌన్సిలర్‌ లక్ష్మి, మార్కెట్‌యార్డు మాజీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు ఇసాక్‌ భార్య మాజీ కౌన్సిలర్‌ వసీమా బేగం, మాజీ కౌన్సిలర్‌ కబీర్‌దాస్‌ అనిత ఉన్నారు. వీళ్లు ఇప్ప టికే రాజకీయాలలో ఉండి ప్రజలకు సేవ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ నుంచి కౌన్సిలర్లు గెలుపొందితే వీరిలో ఒకరు చైర్‌పర్సన్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ము స్లిం, ఎస్సీలకు చైర్మన్‌గా అవకాశం దక్కలేదు. ఆ పరంగా చూస్తే ముస్లిం వర్గం నుంచి వసీ మాబేగం, ఎస్సీవర్గం నుంచి రామేశ్వరమ్మ లైన్‌లో ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే వర్గం, సరిత వర్గం వాళ్లు ఉన్నారు. బీ ఫారాలు ఎవరికి వస్తాయోనన్న చర్చ సాగుతున్నది. ఎవరికి వ స్తే వారి వర్గంవారు చైర్‌పర్సన్‌ అయ్యే అవకా శం ఉంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ సతీమణి మాజీ కౌన్సిలర్‌ కళావతి పేరు వినిపిస్తున్నది. మరోసారి గద్వాల మునిసిపల్‌పై బీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేయాలనే ఆలోచనతో బీఎస్‌ కేశవ్‌ బలమైన అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా బీజేపీ కూడా ఈసారి గద్వాల మునిసిపాలిటీని దక్కించుకోవాలని బలమైన అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైంది. గత ఎన్నికల్లో కొన్నిసీట్ల తేడాతో కోల్పోయిన ఈసారి పూర్తి మెజారిటీతో దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నది. పూర్తి మెజార్టీ సాధి స్తే మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌లుగా గద్వాల ప్రజలకు సేవలందించిన మాజీ చైర్‌పర్సన్‌లు బండల పద్మావతి, కృష్ణవేణి, బీజీపీ పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ పేర్లు వినిపిస్తున్నాయి. అయిజ మునిసిపాలిటీ బీసీ జనరల్‌కు కేటాయించారు. దీంతో కాంగ్రె స్‌ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మాస్టర్‌ షేక్షావలి పేరు వినిపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి చురుగ్గా పనిచేస్తున్న సీఎం సురేశ్‌ పేరుతో పాటు రియల్‌ ఎస్టేటర్‌ చాకలి ఆంజనేయులు, మల్లయ్య పే ర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ మంచి అభ్యర్థులను వెతికే పనిలో ఉన్నది. అలంపూర్‌ ముని సిపాలిటీ బీసీ జనరల్‌కు కేటాయించగా ఇక్క డ కాంగ్రెస్‌ నుంచి మాజీ జడ్పీటీసీ, టెలికం అడ్వయిజరీ కమిటీ సభ్యులు ఇస్మాయిల్‌, ప ట్టణ అధ్యక్షుడు ఆసిఫ్‌ఖాన్‌ పేర్లు వినిపిస్తు న్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రిటైర్డ్‌ ఉపా ధ్యాయులు వెంకట్రామయ్య శెట్టి, మాజీ కౌన్సి ల్‌ శేఖర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లంతా వారి పార్టీ తరఫున మెజార్టీ స్థానాలు పొందినప్పుడే చైర్మన్‌లు అయ్యే అవకాశం ఉంది.

Updated Date - Jan 18 , 2026 | 11:18 PM