Share News

విద్యుదాఘాతానికి మహిళ బలి

ABN , Publish Date - Apr 30 , 2026 | 11:37 PM

విద్యుదా ఘాతానికి మహిళ మృతి చెందగా, ఆమె ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.

విద్యుదాఘాతానికి మహిళ బలి

- అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలు

కొత్తపల్లి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): విద్యుదా ఘాతానికి మహిళ మృతి చెందగా, ఆమె ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటన నారా యణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని దుప్పటి గట్టు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దుప్పటిగట్టు గ్రామానికి చెందిన అనురాధ (35) నిరుపేద కుటుంబానికి చెందినది. ఇటీవలే ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మా ణం కొనసాగుతుండటంతో.. గోడలకు నీరు పట్టి.. అనంతరం వైర్లను తొల గిస్తున్న క్రమంలో కరెంట్‌ షాక్‌కు గురైంది. గమనించిన చుట్టుపక్కల వారు మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, భర్త కూడా గత సంవత్సర క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయారని గ్రామస్థులు కంటితడి పెట్టుకున్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Apr 30 , 2026 | 11:37 PM