సావిత్రిబాయి ఆశయాలతో.. విద్యాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:40 PM
సావిత్రిబాయి ఫూలే విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆమె ఆశయాలకు మనమంతా కృషి చేద్దామని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సావిత్రిబాయి జయంతిని ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది.
కలెక్టర్ విజయేందర బోయి
17 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు పురస్కారాలు
మహబూబ్‌నగర్, విద్యావిభాగం జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సావిత్రిబాయి ఫూలే విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆమె ఆశయాలకు మనమంతా కృషి చేద్దామని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సావిత్రిబాయి జయంతిని ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని 17 మంది మహిళా ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో అవార్డులు అందించి, సన్మానించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సావిత్రి బాయి ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళి అన్నారు. అనంతరం మాట్లాడుతూ మహిళా విద్యకు సాయిత్రిబాయి బిజం వేశారన్నారు. ఆమె చూపిన మార్గం వల్లే బాలికలకు నేడు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో 52 శాతం మహిళలు ఉండగా, 58 శాతం బాలికలు చదువుతున్నారని తెలిపారు. ప్రభుత్వ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు. గత ఏడాది కన్న మంచి ఫలితాలు సాధించన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి కృష్ణ, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, గిరిజన అభివృద్ధి అధికారి జనార్ధన్, ఉద్యాన వనశాఖ అఽధికారి వేణుగోపాల్, ఏఎంవో దుంకుడు శ్రీనివాస్, సీఎంవో సుధాకర్‌రెడ్డి, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.