గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:37 PM
జాతీయ స్థాయి క్రీడల్లో క్రీడాకారులు ప్రతిభను చాటాలని, క్రీడల్లో గెలుపో టములను సమానంగా స్వీకరించా లని కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్య క్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి అన్నా రు.
- కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి
మరికల్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి క్రీడల్లో క్రీడాకారులు ప్రతిభను చాటాలని, క్రీడల్లో గెలుపో టములను సమానంగా స్వీకరించా లని కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్య క్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి అన్నా రు. వారంరోజుల నుంచి మండల శి వారులోని పల్లెగడ్డ గ్రామంలో పల్లె గడ్డ ప్రీమియర్ లీగ్(పీపీఎల్) క్రికెట్ పోటీలను సూర్యచంద్ర ఫౌండేషన్ అ ధినేత సూర్యమోహన్‌రెడ్డి ఆధ్వర్యం లో నిర్వహించారు. పోటీల్లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. శుక్రవారం నిర్వ హించిన ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్మణ్ లె వెన్, నారిబోరా జట్లు తలపడ్డాయి. బహుమతు ల ప్రదానోత్సవానికి హాజరైన శివకుమార్‌రెడ్డి మొదటి బహుమతి విజేత లక్ష్మణ్ లెవెన్ జట్టు కు రూ.80 వేల నగదు, షీల్డ్, రెండవ బహుమ తికి నారిబోరా జట్టుకు రూ.40 వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడా నికి సొంత ఖర్చులతో క్రీడలు నిర్వహించి, బ హుమతులు అందించిన సూర్యమోహన్‌రెడ్డితో పాటు, సహకరించిన ప్రతిభ పాఠశాల కర స్పాండెంట్ హన్మంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలి పారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాము, సర్పంచ్ గూపచెన్నయ్య, వీరన్న, హరీశ్, రామకృష్ణారెడ్డి, వివిధ గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.