మాయమైన బంగారం దొరికేనా?
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:26 PM
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో లభించిన గుప్త నిధుల వ్యవహరంలో మాయమైన బంగారం కోసం పోలీసులు విచారిస్తున్నారు.
- నిధి దొరికిన ప్రాంతంలో పోలీసుల విచారణ
గట్టు, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో లభించిన గుప్త నిధుల వ్యవహరంలో మాయమైన బంగారం కోసం పోలీసులు విచారిస్తున్నారు. గురువారం గట్టు ఎస్‌ఐ శేఖర్‌గౌడ్ నిధు లు లభించిన నేతాజీ సుబోచంద్రబోస్ విగ్రహ సమీపంలోని శ్యామ్‌సుందర్‌జోషి నివాస ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిధు లు దొరికిన గోడను పూర్తిగా పరిశీలించారు. నిఽధులకు సంబంధించి అ సలు వదిలి కోసరు మాత్రమే కూలీలు అప్పజెప్పడం అనుమానాలకు తావిస్తున్నది. కేవలం వెండి నాణేలను మాత్రమే చూయించడం, అం దులో కూడా మొత్తం కాకుండా 33 నాణేలు, ఒక బంగారు ముక్కతో పాటు రూ.లక్ష నగదును మాత్రమే చూపి వీటీతోనే సరిపెట్టి చేతులు దులుపుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే బంగారంతో పాటు కొన్ని వెండి నాణేలను విక్రయించినట్లు తెలుస్తుంది. నాణేలను కొన్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ నిధుల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే తహసీల్దార్ విజయ్‌కుమార్ ఫి ర్యాదు మేరకు నాణెల వ్యవహారంంలో ఉన్న మేస్ర్తీ గోపి, కూలీలు రా ముడు, జిమ్మేష్, బజారి, భాస్కర్‌ల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా బిచ్చాలపేటలో భారీగా బంగారం లభ్యమైందని, దీనిపై కూడా పోలీసులు దృష్టి సారించి విచారించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా గద్వాల డీఎస్పీ వై. మొగిలయ్య గురువారం గట్టు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.