నిమజ్జనంలో.. డీజేల నిషేధం అమలయ్యేనా?
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:39 PM
వినాయక నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు. కేసులు నమోదు చేస్తాం. డీజేలను సీజ్ చేస్తాం. అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
జడ్చర్ల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : వినాయక నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు. కేసులు నమోదు చేస్తాం. డీజేలను సీజ్ చేస్తాం. అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్ర తీ సంవత్సరం పోలీసులు హెచ్చరించడం.. ఊరే గింపులో డీజేలను ఏర్పాటు చేసుకోవడం పరిపా టిగా మారింది. నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి ఇవ్వాలని రాజకీయ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో ప్రతీ ఏడాది డీజేల వినియోగం కొనసాగుతూనే ఉంది. కానీ ఈ పర్యాయం డీజే నిషేధం ఖచ్చితంగా అమలు చేస్తామని పోలీసులు అంటున్నారు. కానీ క్షే త్రస్థాయిలో అందుకు భిన్నంగా కొందరు యు వకులు ఇప్పటికే డీజేల కు అడ్వాన్స్‌లు ఇస్తుండ డంతో డీజేల నిషేధం అమలు అయ్యేనా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీజేలకు బదులుగా బ్యాండు మేళం, సౌండ్‌బాక్స్‌లు, డోలు, ఢంకాలను వినియోగించాలని, సాంప్రదాయ నృత్యాలతో వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని జరుపుకోవాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోస్గి, గద్వా లలో డీజే శబ్దానికి గుండె ఆగి ప్రాణాలు పోయిన సంఘటనలున్నాయి. ఈ సంఘటనలు దృ ష్ట్యా డీజేలకు అనుమతి లేదంటూ పోలీసులు వెల్లడిస్తున్నారు. ఓ వైపు పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో డీజేలను యథేచ్చ గా వినియోగిస్తున్నారు. గతంలో కేసులు నమో దైన డీజేల నిర్వాహకులను ఉమ్మడి జిల్లాలోని కొన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో బైండోవర్ చేస్తు న్నారు. జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో గత వారం 15 మంది డీజేల నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చి డీ జేలను ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తా మంటూ సీఐ కరుణాకర్ హెచ్చరించారు.