Share News

భర్తను చంపిన భార్యకు రిమాండ్‌

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:20 PM

అ నుమానంతో వేధి స్తున్న భర్తను డం గు పారతో కొట్టి చంపిన భార్యను రిమాండ్‌ చేసినట్లు ఆదివారం వనపర్తి పట్టణ కేంద్రంలోని సీఐ కార్యాలయం లో విలేకర్ల సమావేశంలో సీఐ కృష్ణ వెల్లడించారు.

 భర్తను చంపిన భార్యకు రిమాండ్‌

- విలేకరుల సమావేశంలో వెల్లడించిన సీఐ కృష్ణ

వనపర్తి రూరల్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): అ నుమానంతో వేధి స్తున్న భర్తను డం గు పారతో కొట్టి చంపిన భార్యను రిమాండ్‌ చేసినట్లు ఆదివారం వనపర్తి పట్టణ కేంద్రంలోని సీఐ కార్యాలయం లో విలేకర్ల సమావేశంలో సీఐ కృష్ణ వెల్లడించారు. గోపాల్‌పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన మేకల శివమ్మ, చిన్న మల్లయ్య దంపతులు. గొ ర్రెల కాపరిగా ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తుండేవారు. చిన్న మల్లయ్య తర చూ మద్యం సేవించి భార్యపై అనుమానం పెట్టుకుని గొడవ చేస్తుండేవా డు. ఈ నెల 16న రోజు మాదిరిగా గొర్రెలను మేపిన అనంతరం అదే గ్రా మంలోని గుండ్లగడ్డ కాలనీలో పాయల పరమేశ్‌ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కొట్టం దగ్గర ఇద్దరికీ గొడవ జరిగింది. అదే గొడవల్లో తరచూ వేధిస్తున్నాడని పక్కనే ఉన్న డంగ్‌ పారతో భర్త ముఖంపై కొట్టింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తపు మరకలతో ఉ న్న పారను బుట్ట కింద దాచి పెట్టి భర్తను గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ ద్వారా తన ఇంటికి తీసుకెళ్లింది. భర్త మెట్లపై జారి పడిపోయి చనిపోయాడని కు టుంబ సభ్యులను అబద్ధంగా నమ్మించే ప్రయత్నం చేయగా, బుట్టకింద దా చిన పార కన్పించడంతో ఆమెను గట్టిగా నిలదీశారు. ఆమె చేసిన నేరాన్ని కుటుంబ సభ్యులతో ఒప్పుకుంది. మృతుడు చిన్న మల్లయ్య అన్న వెంకట య్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలా నికి వెళ్లిన పోలీసులు శివమ్మను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం చేసినట్లు ఆమె ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్న ట్లు తెలిపారు. ఎస్‌ఐ జగన్మోహన్‌, రమామని, నాగేష్‌, మౌలాన ఉన్నారు.

.

Updated Date - Jan 18 , 2026 | 11:20 PM