వయోవృద్ధుల హక్కులపై విస్తృత అవగాహన
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:00 AM
Widespread awareness regarding the rights of the elderly
వయోవృద్ధుల హక్కులపై విస్తృత అవగాహన
వనపర్తి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : వ యోవృద్ధుల హక్కులు, సంక్షేమం, భద్రతపై ప్ర జలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎ స్పీ డి.సునీతారెడ్డి సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా గురువారం ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. వయోవృద్ధుల స మాచార సంచికతో పాటు తల్లిదండ్రులు వయో వృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం- 2007కు సంబంధించిన పుస్తకాలను విడుదల చేశారు. అ లాగే వయోవృద్ధుల హక్కులు, వారికి అందుబా టులో ఉన్న ప్రభుత్వ సేవలు, చట్టపరమైన రక్ష ణ తదితర వివరాలను ప్రజలకు తెలియజేసేం దుకు పోలీసుస్టేషన్లలో ఏర్పాటు చేయనున్న డి స్‌ప్లే బోర్డులను ఆవిష్కరించారు. వయోవృద్ధుల కు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సే వలు, చట్టపరమైన రక్షణపై వారికి పూర్తి సమా చారం అందించాలని అన్నారు. వయోవృద్ధులు తమ హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అందుబాటులో ఉన్న సేవలను సద్వినియోగం చేసుకునేలా అవసరమైన సమాచారాన్ని అం దించాలని ఎస్పీ సూచించారు. వయోవృద్ధుల స మస్యలను సత్వరమే పరిష్కరించేందుకు సం బంధిత శాఖలు సమన్వయంతో పని చేయాల న్నారు. వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తం గా వయోవృద్ధుల హక్కులు, సంక్షేమంపై అవ గాహన కారక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఎం హెచ్‌వో భాస్కర్‌నాయక్, డీఆర్‌డీవో రామమహే శ్వర్, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, సీని యర్ సిటిజన్ కమిటీ సభ్యులు, సీడీపీవోలు, జి ల్లా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.